Tuesday, 7 January 2014

మన జైపూర్

చరిత్ర : 
                         కార్యాలయ ఆవరణలో ఉన్న కుందమాంబ శాసనాలు 

అప్పట్లో వరంగల్ రాజధానిగా చేసుకొని పరిపాలించిన చక్రవర్తి కాకతి గణపతి యొక్క సోదరి కుందమాంబ . జైపూర్ మండలంలో కుందారం గ్రామంను నిర్మించడంతో పాటు ఆ గ్రామంలో వివిధ ఆలయాలని నిర్మించారామె. అందులో కుందేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో నిత్యం పూజలు చేసే బ్రాహ్మణోత్తములకి అగ్రహారంగా ఆలయం సమీపాన కుంద సముద్రం అనే చెరువు కింది భాగంలో ఉన్న భూములని వారికి ఇచ్చినట్లుగా తెలియ చెప్పేది ఈ శిలా శాసనం. దీనిని వివరిస్తూ సంస్కృతంలో 155 చరణాలు ఉన్నట్లు కుందారం గ్రామానికి చెందిన పురోహితులు తెలిపారు. ఆ ఆలయాన్ని గుప్తనిధులకై దుండగులు ధ్వంసం చేయడంతో , ఆలయం శిథిలావస్థ కు చేరుకుంది. దీంతో ఆ శాసనాలని పదిల పరిచేందుకు వీటిని చెన్నూర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రతిష్టించారు.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers