కాలం ఏదైనా పచ్చగా కనిపిస్తుందా గ్రామం. ఏడాదికి రెండు సార్లు చేతికి వచ్చే వరిపంట.. రైతుల ఇళ్లలో పసిడి కాంతులు కురిపిస్తుంటుంది! ఇక్కడి మామిడి రుచే వేరు! పత్తి, మిర్చితోపాటు.. వివిధ రకాల కూరగాయల సాగు ఇక్కడి ప్రజలను స్వయం సమృద్ధులను చేస్తోంది. చారిత్రకం గా కూడా ఈ ఊరుకు 400 ఏళ్ల చరిత్ర ఉంది! ఎన్నో ఏళ్ల క్రితంనాటి దొరల గడి.. నేటికీ నిలిచి ఉంది. ఆ గ్రామం పేరు ఇందారం!
కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలను కలిపే గోదావరి బ్రిడ్జికి పక్కనే రాజీవ్ రహదారికి ఆనుకొని ఉండే ఈ గ్రామంలో 6000 జనాభా ఉంది. సుమారు 2000 ఎకరాల సాగు భూమి ఉంది. వరి రెండు పంటలు పండుతుంది. మిర్చి, పత్తి, పసుపు లాంటి పంటలు కూడా పండుతాయి.
ఈ గ్రామం పేరు ఇకపై రెవెన్యూ రికార్డుల్లో వినిపించదు! ఈ ఊరు భౌగోళిక ఆనవాళ్లు ఇకపై కనిపించవు! సింగరేణి యాజమాన్యం సృష్టించనున్న మరో జీవన విధ్వంసంలో ఈ ఊరు అదృశ్యమైపోనుంది! అందుకు కారణం.. కొన్నేళ్ల క్రితం ప్రతిపాదించి.. జనం నిరసనతో పక్కనపడేసి.. లాభాల తాపవూతయంతో మళ్లీ తెరపైకి తెస్తున్న ఓపెన్‌కాస్ట్! ఇప్పటికే వందల గ్రామాలను, లక్షల ఎకరాల పంట పొలాలను కనుమరుగు చేసి, వేలాది జీవితాల్లో నిప్పులు పోసిన ఓపెన్ కాస్టులు.. ఇప్పుడు ఇందారంపై పడగ విప్పాయి. పచ్చని గ్రామాన్ని కబళించేందుకు సిద్ధమవుతున్నాయి!
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం శివారులో భూగర్భ గనులు ఉన్నాయి.అందులో ఐకే 1 గని మూసేశారు.దీంతోపాటు ఐకే 1ఏ గనిని కూడా కలిపి చాలా పెద్ద ఓపెన్‌కాస్టు చేసే ప్రణాళికను రూపొందించారు. వీలయినంత త్వరగా బొగ్గును తవ్వాలని చూస్తున్నారు. ఓసీ వస్తే ఒక జీవన విధ్వంసమే. ఓసీ రాకుండా ఓసీకి వ్యతిరేకంగా పోరాడటానికి గ్రామస్థులంతా ఓసీ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.
2006 సంవత్సరంలో మొట్ట మొదటిసారి ఈ గ్రామంలో ఓసీ ఏర్పాటు చేయడానికి సింగరేణి నిర్ణయించింది. దీని చుట్టుపక్కల ఉన్న 1995 ఎకరాల భూమిని తీసుకునేందుకు 2006, సెప్టెంబర్ 14న ముందు ప్రయత్నం చేశారు. ఆ తరువాత ఈ 1995 ఎకరాల నుంచి 54 ఎకరాలను ఉపసంహరించుకుంటున్నట్లు జూన్ 23, 2009లో సింగరేణి ఒక ప్రకటన చేసింది. ఐకే 1 గనిని మూసివేసిన సింగరేణి యాజమాన్యం ఈ గనిలో ఉన్న బొగ్గును తీయడానికి ఓపెన్ కాస్టు విధానాన్ని అమలు చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.
దీనిపై 2007 ఫిబ్రవరి 23న జరిగిన సింగరేణి బోర్డు మీటింగ్‌లో అనుమతి పొందింది. అంతకు ముందే 2006 జనవరి 25న ఒక ప్రకటన విడుదల చేస్తూ నష్టాల ఫలితంగా ఐకే 1 (ఇందారం ఖని 1)ని మూసివేస్తున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి పలు మార్లు పబ్లిక్ హియరింగ్‌ను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 1, 200లో ఒక నోటిఫికేషన్, అదే నెల 3న ఒక డిక్లరేషన్‌ను కూడా జారీ చేసింది. ఇందారం గ్రామంలో 6,000 జనాభా ఉంది. ఇందారం ఓసీతో దెబ్బతినే మరో గ్రామం ఇక్కడ 4000 జనాభా ఉంది. ఈ రెండు గ్రామాలలో 5400 మంది ఓటర్లున్నారు. 99 శాతం వ్యవసాయంపైనే ఆధారపడే ఈ రెండు గ్రామాలు గోదావరి నది ఒడ్డున ఉంటాయి. పత్తి, వరి, మిర్చి, కూరగాయలు, దాదాపు 100 ఎకరాల మామిడితోటలు ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా గోదావరి ఒడ్డులో సుమారు 500 ఎకరాల వరి పంట సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది.
సుమారు 2000 మంది ఇక్కడనే కైకిలి చేసుకొని జీవిస్తున్నారు. మరో వెయ్యి మంది గోదావరిఖని, ఇటు శ్రీరాంపూర్ ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి కైకిలికి వస్తుంటారు. అటు కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఇటు మంచిర్యాల వైపు ఇందారం వద్ద గోదావరి మీద కట్టిన బ్రిడ్జి 1994 నుంచి పని చేస్తోంది. రాకపోకలు పెరిగాయి. రాజీవ్ రహదారికి పూర్తిగా ఒక వైపు అంటి ఉండే ఈ గ్రామం అటు చెన్నూర్- జగ్దల్‌పూర్ జాతీయ రహదారికి కూడా సమీపంలోనే ఉంటుంది. ఇందారం గ్రామంలో 3000కుపైగా పక్కా ఇళ్లు ఉన్నాయి. ఏ కాలంలోనైనా పచ్చగా కనిపించడం ఈ గ్రామం ప్రత్యేకత. అప్పుడెప్పుడో ముత్యం రావు అనే దొర నిర్మించిన గడి ఇంకా ఉంది. ఈ గ్రామానికి ఈ గడి ముఖద్వారం. ఈ గడి ఇప్పటికీ ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఇక్కడి మామిడి కూడా ప్రత్యేకమే.
అలాంటి ఈ గ్రామంలో ఓసీ ఏర్పాటును ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించడంతో గత రెండేండ్ల క్రితం ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రజలు వ్యతిరేకిస్తున్న కారణంగా ఇందారం ఓసీ రాదని ఆరు నెలల క్రితం సింగరేణి సీఎండీ కూడా చెప్పారు. కానీ.. గత వారం పది రోజులుగా పరిస్థితి మారిపోయింది. గని ఏర్పాటుకు సిగరేణి యాజమాన్యం లోపాయికారిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి సర్వే కూడా ప్రారంభించారు. నిధులు కూడా మంజూరు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందారం గ్రామాన్ని ఎట్టి పరిస్థితులలో వదిలేది లేదని, చుట్టు పక్క భూములన్నీ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతోపాటు పలువురు వ్యక్తులు అంతకు ముందే కొనుగోలు చేశారని సమాచారం. ఆ భూములను వారు సింగరేణికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని, వారి వల్లనే మళ్లీ ఓసీ వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెప్పారు. ఓసీకి వ్యతిరేకంగా తాము దశలవారీగా ఉద్యమించేందుకు సిద్దమవుతున్నామని తెలిపారు.

No comments:
Post a Comment