Tuesday, 7 January 2014

Mandamarri Muncipality - మందమర్రి మున్సిపాలిటీ

గతంలో మందమర్రి గ్రామ పంచాయితీగా ఉండేది. ప్రభుత్వం 1993  అక్టోబర్ 21 న నోటిఫైడ్ ఏరియా గా ప్రకటించింది. ఈ క్రమంలో ఇక్కడ బొగ్గు గనులు విస్తరించడంతో, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు ఇక్కడే స్థిర పడ్డారు. పంచాయితీ జనాభా కంటే ఎక్కువగా ఉండటంతో 1995 మే 8 న మందమర్రికి మూడో గ్రేడ్ మున్సిపాలిటీ హోదాని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని 1998 మే 21 న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో, నామినేషన్ పర్వం కూడా ముగిసి ఎన్నికల ప్రచారం కొనసాగింది...అభ్యర్థులు వేల రూపాయలు ఖర్చుపెట్టి ప్రచారాలు సాగించారు. ఇదే సమయంలో ఏజెన్సీ ఏరియా లో ఉన్న మందమర్రిలో 1 /70 చట్టం అమలులో ఉన్నందున ఇక్కడి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పదవి SC (మహిళ) కి కాకుండా ST లకి కేటాయించాలంటూ,అప్పటి మాజీ గ్రామ పంచాయితీ సర్పంచ్ మద్ది రాం చందర్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.దీంతో 1998 జూన్ 18 న ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ చేసింది. మాజీ సర్పంచ్ రామ్ చందర్ పిటీషన్ ని సవాల్ చేస్తూ  చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవ రావు భార్య ఆశానిర్మల (SC)  కోర్టుని ఆశ్రయించింది. అనంతరం వాది, ప్రతివాదుల తరపున కోర్టులో ఎవరూ హాజరు కాకపోవడంతో 2005 ఏప్రిల్ 5 న కేసుని డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  1996 లో ఏదుల మల్లేశం (ST) అనే వ్యక్తి కూడా కోర్టుని ఆశ్రయించాడు. తర్వాత ఆయన కుడా వాదన సమయంలో కోర్టుకి హాజరు కాకపోవడంతో, 2 సంవత్సరాల క్రితం కోర్టు ఈ కేసుని కూడా డిస్మిస్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకి ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముందుకి సాగలేదు. 17 సంవత్సరాలుగా పాలక వర్గం లేకపోవడంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ నాయకుల కనుసన్నల్లో అధికారులు పని చేసే పరిస్థితి నెలకొంది. 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers