Thursday, 8 March 2012

శివాలయం, చెన్నూర్ :


చెన్నూర్ లోని చెరువు కట్టకి సమీపం లో గల శివాలయం ఈ పరిసర గ్రామాల్లో చాలా ప్రసిద్ధమైనది...


ఈ ఆలయాన్ని అంబా అగస్తేశ్వర ఆలయం అని కుడా అంటారు..ఈ అఆలయం కాకతీయ రాజుల కాలంలో, నిర్మితమైనది.. పట్టణ సమీపంలోని పంచ క్రోశ ఉత్తరవాహినిలో అగస్త్య మహాముని స్నానమాచరించి, అక్కడ తపస్సు చేసి, స్థానిక శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. అందుకే ఈ ఆలయానికి అంబా అగస్తేశ్వర ఆలయం అని పేరు సంతరించుకుంది.. ఇక్కడి మరో ప్రత్యేకత- ఆలయ గర్భ గుడిలో శతాబ్దాల కాలంగా ,అఖండ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది.. ఆలయానికి సంబంధించి తెలుగు, కన్నడ మిశ్రమ భాషల్లో అక్షరాలూ చెక్కి ఉన్న శాసనం..దానిపై శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ప్రస్సిద్ది చెందిన మహామంత్రి తిమ్మరుసు సంతకం మనకి నేటికీ దర్శనమిస్తుంది..
ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు.. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.. 



ఈ ఆలయానికి సంబంధించిన వీడియో ని క్రింది లింక్ లో చూడండి :
www.youtube.com/watch?v=-Rl12PMnxLg
                                



దీనికి అనుబంధంగా చెన్నూర్ లోని పెద్ద చెరువు మధ్యలో నిర్మించినిదే ..ఈ శివలింగం.. అయితే ఈ కట్టడం  నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు...


ఈ నిర్మానికి సంబంధించిన వీడియోని క్రింది లింక్ లో చూడండి :
www.youtube.com/watch?v=Esv4v7TYTOg&feature=related 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers