Thursday, 8 March 2012

నియోజకవర్గ MLAలు

స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట  జరిగిన  చెన్నూర్-సిర్పూర్ ఉమ్మడి నియోజక వర్గాలలో, చెన్నూర్ నుండి స్థానికుడైన సుడిగాల విశ్వనాథ సూరి MLA గా సోషలిస్ట్ పార్టీ నుండి ఎన్నికయ్యారు..  ఆ తర్వాత 1957 లో  చెన్నూర్-లక్షెట్టిపేట ఉమ్మడి నియోజకవర్గాలు కాగా జి.వెంకటస్వామి గెలుపొందారు.. అనంతరం 1962 లో చెన్నూర్ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది.. ఇందులో మందమర్రి,చెన్నూర్,జైపూర్ కోటపల్లి,వేమనపల్లి,నెన్నెల, మండలాలు ఉండేవి..
            2004 లో పునర్విభజన అనంతరం వేమనపల్లి,నెన్నెల మండలాలు కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గంలో కలిసాయి..దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో నాలుగు మండలాలు కొనసాగుతున్నాయి.. నియోజక వర్గం షెడ్యూల్  కులాల వారికి రిజర్వు చేయబడింది..




1962, 1967, 1972 లలో కాంగ్రెస్ అభ్యర్థి కోదాటి రాజమల్లు MLA గా విజయం సాధించారు..1978 లో కాంగ్రెస్ -ఐ అభ్యర్థిగా పోటీ చేసిన సి.నారాయణ గెలుపొందారు..1983 లో సంజయ్ విచార్ మంచ్ నుండి పోటీ చేసిన సాత్కు సంజీవరావు విజయం సాధించారు..1985, 1989, 1994, 1999 లలో తెలుగు దేశం పార్టీ నుండి బోడ జనార్ధన్ వరుసగా నాలుగు సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు.. 2004 లో జి.వెంకటస్వామి పెద్ద కుమారుడు గడ్డం వినోద్ MLA గా విజయం సాధించారు..2009 లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణా వాదాన్ని  బలపరుస్తూ పోటీకి దిగిన TRS పార్టీ అభ్యర్థి నల్లాల ఓదెలు ఘన విజయం సాధించారు..తెలంగాణా ఉద్యమ నేపథ్యం లో ఆయన రాజీనామా చేయగా 2010 లో వచ్చిన  ఉప ఎన్నికల్లో మరోసారి నల్లాల ఓదెలు విజయం సాధించారు..




మంత్రి పదవులు పొందిన వారు:
చెన్నూర్ నియోజక వర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యే గా కొనసాగిన కోదాటి రాజమల్లు ఆరోగ్య శాఖా మంత్రిగా , నాలుగు సార్లు గెలుపొందిన బోడ జనార్ధన్  కొన్ని నెలల పాటు కార్మిక శాఖా మంత్రిగా పని చేసారు...

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers