Thursday, 8 March 2012

టీఆర్ఎస్ విజయకేతనం

మంచిర్యాల, చెన్నూర్, సిర్పూర్ అసెంబ్లీ నియోజక వర్గాలకు 2010 జూలై నెల 27వ తేదిన జరిగిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు, తాజా మాజీలే భారీ మెజార్టీతో విజయం సాధించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు మంచిర్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్‌లు కోల్పోయారు. మంచిర్యాల టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పోలయిన లక్షా 30 వేల 107 ఓట్లలో మొత్తం 95 వేల 181 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి గోనె హన్మంతరావుకు 17 వేల 259, కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ క్రిష్ణారావుకు 12 వేల 646 ఓట్లు వచ్చాయి.


77 వేల 922 ఓట్ల మెజార్టీతో అరవింద రెడ్డి విజయం సాధించగా హన్మంతరావు, క్రిష్ణారావులు డిపాజిట్ కోల్పోయారు. వీరితోపాటు మరో పది మంది ఇండిపెండెంటులు కూడా డిపాజిట్లు కోల్పోయారు. చెన్నూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లాల ఓదెలుకు పోలయిన లక్షా 12 వేల 448 ఓట్లలో 67 వేల 887 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జీ వినోద్‌కు 23 వేల 603 ఓట్లు వచ్చా యి.




టీడీపీ అభ్యర్థి బోడ జనార్ధన్‌కు 6,683 ఓట్లు రాగా ఆయన తన డిపాజిట్‌ను కోల్పోయారు. కాంగ్రెస్ అభ్యర్థిపై నల్లాల ఓదెలు 44 వేల 284 ఓట్ల ఆధిక్యంను సాధించారు. ఇక్కడ 18 మంది ఇండిపెండెంట్లు కూడా డిపాజిట్‌లు కోల్పోయారు. సిర్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తాజా మా జీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యకు పోలయిన లక్షా 26 వేల 957 ఓట్లలో 56 వేల 241 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి 41 వేల 27 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పాల్వా యి రాజ్యలక్ష్మీకి 19 వేల 770 ఓట్లు రాగా ఆమె డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ అభ్యర్థిపై సమ్మయ్య 15 వేల 214 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ కూడా తొమ్మిది మంది ఇండిపెండెంట్లు డిపాజిట్లు కోల్పోయా రు.




గత ఎన్నికలలో మహాకూటమి భాగస్వామిగా టీడీపీపై మూడు సీట్ల ను టీఆర్ఎస్‌కు వదిలింది. ఈ సారి తెలంగాణ కోసం పై ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి పోటీకి దిగగా 2009లో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఈసారి ప్రత్యర్థిగా రంగంలోదిగింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్‌లు ఒంటరిగా పోటీ చేసినప్పటికి టీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే మద్ధతును ఇచ్చింది. దాదాపు ఈ ఎన్నికలలో ఐకాస టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొని ముందుకు సాగిందని పేర్కొనవచ్చు.




ప్రచారానికి కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరాం, విజయశాంతి, నాయిని నర్సింహా రెడ్డి, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, శ్రీహరి, సతీశ్, కెంగర్ల మల్లయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, తదితర నాయకులు ఓయూ, కేయూ విద్యార్థులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, తెలంగాణ ఐక్య వేధిక నేతలు, జేఏసీ, సింగరేణి నాయకులు, ఇలా ఎందరో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు.




మరోవైపు కాంగ్రెస్ తరుపున సీడబ్ల్యూసీ సభ్యులు జి వెంకటస్వామి, ఎంపీలు వివేక్, రాజగోపాల్ రెడ్డి, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దానం నాగేందర్, సబితా ఇంద్ర్రా రెడ్డి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, ప్రసాద్, ఎమ్మెల్సీలు బీ వెంకట్రావు, ప్రేం సాగర్‌రావు, ఇలా ఎందరో నాయకులు అటు టీడీపీ నుంచి ఎంపీ నామ నాగేశ్వర్‌రావు, మాజీ హోంమత్రి దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వీర వెంకటయ్య,




టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్, ఖాదర్, ఇలా ఎందరో ప్రచారం నిర్వహించారు. తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అనే తెలంగాణ గురించి నినాదం కాంగ్రెస్‌ది పేలలేదు. పేలవం అయిపోయింది. మరోవైపు తెలంగాణ కోసం అవసరమయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తామని, తెలంగాణ కోసం ఉద్యమిస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేయడం కూడా ఫలించలేదు. తెలంగాణ వాదం అంతా టీఆర్ఎస్‌కే సొంతమయింది. టీఆర్ఎస్ అభ్యర్థులను త్యాగధనులుగా గుర్తించిన ప్రజలు వారికే పట్టం కట్టడం కొసమెరుపు.







హరీష్ తర్వత అరవిందరెడ్డిదే ఆధిక్యం


( మంచిర్యాల) రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి శుక్రవారం వచ్చిన ఫలితాలలో సిద్ధిపేట టీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అనంతరం రెండవ స్థానంలో, జిల్లాలోనే ప్రథమ స్థానంలో మెజార్టీ సాధించడంలో మంచిర్యాల టీఆర్ఎస్ అభ్యర్థి జి అరవింద రెడ్డి సరికొత్త రికార్డును నమోదు చేసినట్లయింది. తన ప్రత్యర్థులయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు, అటు మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, కాం గ్రెస్ అభ్యర్థి ఆర్ క్రిష్ణారావు డిపాజిట్‌లు కూడా గల్లంతయ్యాయి.




లక్షా 30 వేల 113 ఓట్లు పోలయితే అందు లో అరవింద రెడ్డికి 95 వేల 181 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి 17 వేల 259, కాంగ్రెస్ అభ్యర్థికి 12 వేల 646 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిపై 77 వేల 922 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. జిల్లాలోనే ఇంత మెజార్టీతో విజయం సాధించిన అభ్యర్థి లేరని కూడా పేర్కొనవచ్చు... మంచిర్యాల (లక్షెట్టిపేట) నియోజక వర్గం రికార్డులనే అరవిందరెడ్డి బద్ధలు కొట్టారు.




కాగా చెన్నూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన బోడ జనార్దన్ డిపాజిట్ గల్లంతు చేయడమే కాకుండా, గతంలో పోటీ చేసి ప్రత్యర్థులపై 40 వేల మెజార్టీ సాధించి, విజయాన్ని నమోదు చేసుకొని ఉన్న ఆయన రికార్డును బద్ధలు కొట్టారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జి వినోద్‌పై 44 వేల 284 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వినోద్‌కు 23,603 ఓట్లు వచ్చాయి. ప్రారం భ రౌండ్ నుంచి అరవిందరెడ్డి, ఇటు ఓదెలులు ఆధిక్యంలోనే ఉన్నారు.




ఉప ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి జిల్లా లో కడుదీనంగా మారింది. తాను విజయం సాధించినప్పుడల్లా పది వేల సంఖ్య తగ్గని మాజీ మంత్రి, చెన్నూర్ టీడీపీ అభ్యర్థి బోడ జనార్ధన్‌కు ఈ ఉప ఎన్నికలలో దారుణమైన పరాజయం ఎదురు కావడమే కాకుండా డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం 6683 ఓట్లు మాత్రమే ఆయన కు వచ్చాయి.




ఏ పోలింగ్ బూతులో నూ 500లకు మించి కొన్ని చోట్ల, మరికొన్ని చోట్లయితే 50 ఓట్లు కూడా దా టని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి నుంచి విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యేకు 67 వేల 887 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 23,603 ఓట్లు వచ్చాయి. 44 వేల 284 ఓట్ల మె జార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదె లు విజయం సాధించారు.

గత 2009 ఎన్నికలలో చెన్నూర్ నుంచి పోటీ చేసిన నల్లాల ఓదెలుకు 44 వేల 892 ఓట్లు రాగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జి వినోద్ 33 వేల 418, పీఆర్పీ అభ్యర్థి అందుగుల శ్రీనివాస్‌కు 20 వేల 890 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 2,836, లోక్‌సత్తా అభ్యర్థికి 2,600 ఓట్లు వచ్చాయి. ఈ సారి పీఆర్పీ, బీజేపీ, లోక్‌సత్తా అభ్యర్థులు ఎవరూ రంగంలో లేరు. ఏ పార్టీకి ఎవరితో పొత్తు లేదు. అయితే పోలయిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓదెలుకు 67 వేల 887 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి వినోద్‌కు 23 వేల 603, టీడీపీ అభ్యర్థి బోడ జనార్దన్ 6 వేల 683 ఓట్లు వచ్చాయి.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers