Thursday, 8 March 2012

ఐకమత్యభావం

నియోజక వర్గంలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు...ఆ తర్వాత ముస్లీములు ,క్రైస్తవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.. అయినా అందరూ ఐకమత్యం తో , పరస్పర సహకార భావంతోనే మెలుగుతున్నారు.. ఎప్పుడూ మత కలహాలు జరిగిన దాఖలా లేదు.... పైగా ముస్లీములతో ఎక్కువ సాన్నిహిత్యం తో మెలగడమే కాకుండా పీరీలు, ఉర్సుల పండగలను హిందువులు కూడా జరుపుకుంటారు.. ఈ ఉత్సవాలలో ముస్లీం ల కన్నా హిందువులే ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం విశేషం.. ఇక ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన సిక్కులు,ఇతర మతస్థులు ఉన్నా, వారి సంఖ్యా చాలా స్వల్పం. అయినా అందరూ పరమత సహనాన్ని పాటిస్తూ, ఐకమత్యంతో కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు..   

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers