నేను ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాను. ఒక విద్యార్థి తండ్రి అడ్మిషన్ రిజిస్టర్‌లో తన పిల్లాడి పేరు మార్చమని వచ్చాడు. తండ్రి కులం ఒ.సి.గా నమోదై ఉంది. మేం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. నా భార్య ఎస్సీ కాబట్టి అడ్మిషన్ రిజిస్టర్‌లో మా పిల్లలకు అలాగే మార్చమని అడుగుతున్నాడు. నేను అలా మార్చవచ్చా? ఆ హక్కు ఎవరికి ఉంటుంది?

ఏదైనా కులధృవీకరణకు సంబంధించిన విషయాలు మార్చాల్సి వస్తే ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ అధికారులకు మాత్రమే ఆ అధికారం ఉంటుంది. మరెవరికీ పాఠశాల రికార్డుల్లో పిల్లల కులాన్ని మార్చే అధికారం ఉండదు. ఆ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడో దానికి సంబంధించిన తహశీల్దారును సంప్రదిస్తే వారు సరైన విచారణ జరిపిన తర్వాత దాని ఆధారంగా కులధృవీకరణ పత్రం ఇస్తారు. దాన్ని మీకు ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పత్రం ఆధారంగా మీరు రిజిస్టర్‌లో మార్చొచ్చు. అంతేకానీ మీరుగా ఆ విద్యార్థి కులాన్ని మార్చకూడదు. మార్చినా అది చట్టబద్ధం కాదు.

No comments:
Post a Comment