నా పేరు ప్రదీప్ కుమార్. నేనొక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. పదవతరగతి సర్టిఫికెట్‌లో నా పేరు ప్రదీప్‌కుమార్ అని ఉంది. ఉద్యోగం చేసే చోట కూడా ఇలాగే ఉంది. బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డుపై మాత్రం ప్రదీప్ రెడ్డి అని ఉంది. ఈ పేర్లలో తేడా వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? ఏం చేయాలో సూచించగలరు.

మీరు ఏ గ్రామంలో నివసిస్తున్నారో దానికి సంబంధించిన తహసీల్దారు కార్యాలయంలోగానీ, పట్టణాలలో అయితే కలెక్టరేట్‌లో గానీ దీనికి సంబంధించిన ఒక విభాగం ఉంటుంది. వారి సంప్రదిస్తే మీరు భారతీయుడే అని ధృవీకరిస్తూ పేరుమార్పునకు సంబంధించిన ఒక సర్టిఫికెట్ ఇస్తారు. కమిషనర్ కార్యాలయంలో కొంత ఫీజు చెల్లించి గెజిట్‌లో పబ్లిష్ చేయించుకోవాలి.
దాన్నిబట్టి మీరు ఏ పేరుని అయితే మార్చుకుంటున్నారో పాత పేరు ఎక్కడెక్కడ అంటే.. స్కూలు రికార్డుల్లో, ఉద్యోగం చేసే చోటగానీ గెజిట్ ఆధారంగా మార్పించుకోవచ్చు. అప్పుడు ప్రదీప్ కుమార్ అలియాస్ ప్రదీప్ రెడ్డి అని రాయకున్నా నడుస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సంస్థలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మీ పేరు ఏది ఉంచుకోవాలనుకుంటున్నారో అది ఉంచుకుని అప్పటి వరకు రికార్డుల్లో ఉన్న పాతపేరుని మార్పించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రావు.

No comments:
Post a Comment