Saturday, 3 March 2012

ఏజెన్సీ ధృవీకరణ పత్రాల జారీకి నిబంధనలు

వివిధ ఉద్యోగ, విద్య అవకాశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి ఏజెన్సీ ధృవీకరణ పత్రాల జారీకి , రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమీషన్ కఠిన నిబంధనలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు పకడ్బందీగా నిబంధనలు గుర్తించిన తర్వాతనే ధృవీకరణ పత్రాలని జారీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమీషన్ D.O. no.K2/1524/2011, తేదీ 17.09.2011 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పరిశీలించాల్సిన అంశాలు :


* 1950 సంవత్సరానికి ముందు ధరఖాస్తుదారుని కుటుంబ సభ్యుల జనన, మరణ వివరాలు ధృవీకరణ జరిగి ఉండాలి.
*1950 సంవత్సరానికి ముందు ఓటర్ల జాబితాలో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి ఉండాలి. 
* దరఖాస్తుదారుడి కుటుంబానికి చెందిన చార,స్థిర ఆస్తులు ,వ్యవసాయ భూములు 1950 సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషన్ చేయాలి.
* పాఠశాల రికార్డులో నమోదు చేసి ఉండాలి.
* ఇతర ధృవీకరణ పత్రాలు సైతం 1950 కి ముందుగా ఉండాలి.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers