Saturday, 3 March 2012

ఎక్సైజ్ శాఖలో అవినీతా..?call: 99662 22271

మీ పరిసరాల్లో గుడుంబా ఏరులై పారుతోందా..? కల్తీ కళ్ళు అమ్ముతున్నారా..?నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయిస్తున్నారా..? ఎన్ని సార్లు చెప్పినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదా.? అయితే 99662 22271 నంబర్ కి కాల్ చేయండి. హైదరాబాద్ లోని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగి తనిఖీ చేస్తారు. ఫిర్యాదు నిజమని తేలితే స్థానిక అధికారులపై తక్షణం చర్య తీసుకుంటారు. మీ వివరాలను మాత్రం రహస్యంగా ఉంచుతారు.
            ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో మొదట్లో లాండ్ లైన్ మాత్రమే ఉండేది.సునీల్ కుమార్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాక మొబైల్ ఫోన్ , రికార్డింగ్ వంటి సదుపాయాలు కల్పించారు.


ఇలా పని చేస్తుంది:
                   9966222271 కి ఫోన్ చేయగానే ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగానికి స్వాగతం. ముందుగా జిల్లా, మండలం,గ్రామం,వీధి పేరు ,సమస్యలేమిటో చెప్పండి. అన్న వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఆ మేరకు వివరాలు చెప్పి ,సమస్యని క్లుప్తంగా మూడు నిమిషాల్లో చెప్పాలి.చెప్పదలుచుకుంది ఇంకా ఉంటే మరోసారి ఫోన్ చేయవచ్చు.సంభాషణ ముందు ఫోన్ లో, తర్వాత కంప్యూటర్లో నమోదు అవుతుంది.వెంటనే అది డైరెక్టర్ వద్దకి చేరుతుంది.సమస్య తీవ్రతని బట్టి టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగుతాయి. సదరు ప్రాంతానికి వెళ్లి రహస్యంగా దర్యాప్తు చేసి 5 నుండి 7 రోజులలోపే విచారణ ముగిస్తాయి.సమస్య తీవ్రతకి స్థానిక అధికారుల వైఫల్యం కారణమని తేలితే,వారిపై తక్షణం చర్యలు తీసుకుంటారు.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers