చెన్నూరు.... ఎందరో కళాకారులకి పుట్టినిల్లు.. సంగీత సాహిత్య సుమాలు విరిసిన నేల ఇది.. గంగా జలంలోని పవిత్రతని సంతరించుకున్న రక్తం ఇక్కడి వీరులది.. అభినవ పోతనగా పేరొందిన వానమామలై వరదాచార్యులు తన కవితా మాధుర్యంతో ఈ ఊరికే వన్నె తెచ్చారు.. జక్కేపల్లి కృష్ణ శాస్త్రి (కిష్టయ్య) గారు తన సంగీత ఝరితో ఈ ప్రాంతాన్ని పులకరింప జేశారు. వారి వారసులు అదే బాటలో నడిచి ఈ నేల ఖ్యాతిని ఇనుమడింపజేశారు. బ్రహ్మశ్రీ స్వయంభట్ల సీతారామయ్య గారనే పండిత వర్యులు, మచ్చ హనుమాన్ సిద్ధాంతి , శేష శాస్త్రి మొదలైన వారు ఇక్కడ తర్క పండితుల్లో ప్రముఖులుగా వెలుగొందారు. బ్రహ్మశ్రీ గట్టు నరహరి శర్మ(వేదం అయ్యవారు ) అవధానిగా, పండితుడిగా ఎన్నో యజ్ఞ,యాగా,జప,తప స్థాపన క్రతువులతో నిత్యక్రుశీవలుడై విరాజిల్లుతున్నాడు. ఇటీవల మన చెన్నూర్ లోని షిరిడీ సాయిబాబా ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసింది కుడా వీరే . ఇక ప్రముఖ పంచాంగకర్త శ్రీరాంభట్ల ముక్తేశ్వర సిద్ధాంతి జన్మ స్థలం కూడా ఇదే. అలాగే ప్రస్తుతం MLC గా ఉన్న, ప్రముఖ జర్నలిస్ట్ K.నాగేశ్వర్ కుడా మన చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి మండలంలోని ఆదిల్ పేట గ్రామంలో జన్మించిన వారే.
No comments:
Post a Comment