Tuesday, 20 March 2012

నెహ్రు యువ కేంద్రాలు

యువజన సంఘాలని ప్రోత్సహించడం ..వాటిని  బలోపేతం చేయడంకోసం కేంద్ర ప్రభుత్వం నెహ్రూ యువజన కేంద్రాలని ఏర్పాటు చేసింది. వీటిలో యువజన సంఘాలని రిజిస్టర్ చేసుకుంటే, NYK పథకాలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి.
        జిల్లాల్లో చురుగ్గా పని చేస్తున్న యువజన సంఘాలని ప్రోత్సహించేందుకు యువజన సంఘ భవనాలు,బస్ షెల్టర్ల  నిర్మాణానికి NYK ఆర్ధిక సహాయం చేస్తుంది. ఒక్కో జిల్లాలో ప్రతి ఏటా నాలుగు సంఘాలకి 20 వేల రూపాయల చొప్పున మంజూరు చేస్తుంది.బడ్జెట్లో అందుకోసం ప్రత్యేకంగా నిధులని కేటాయిస్తారు.అలాగే యువత ఆటలు ఆడటం ద్వారా శారీరకంగా,ధృడంగా ,ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడా సామాగ్రిని కూడా పంపిణీ చేస్తోంది.
           అలాగే యువతని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం అవార్డులు , నగదు పురస్కారాల్ని కూడా అందజేస్తోంది.ఉత్తమ యువజన సంఘానికి 10 వేల రూపాయల నగదు,వ్యక్తిగతంగా ఇద్దరికి చెరో 5 వేల రూపాయల చొప్పున నగదుని పంపిణీ చేస్తారు.ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుంచి, మరుసటి సంవత్సరం మార్చి 31 వ తేదీ వరకి యువజన సంఘాలు చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా వీటిని ఎంపిక చేస్తారు.ఆసక్తిగల సంఘాలు వాటికి సంబంధించిన ఫోటోలు ,పత్రిక కటింగ్ లు ,ఇతర ఆధారాలు, సంఘ రిజిస్ట్రేషన్ ,తదితర పత్రాలతో జూన్ 30 వ తేదీ లోపు NYK కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.యువతకి, క్రీడా,సాంస్కృతిక రంగాల్లో చేయూతనివ్వడం ,వారిలోని ప్రతిభని గుర్తించడం కోసం NYK ఆధ్వర్యంలో ప్రతి ఏటా మండల, బ్లాక్ స్థాయిల్లో పోటీలు ఏర్పాటు చేస్తోంది. ప్రతి ఏటా జాతీయ పండుగలు,ప్రముఖుల జయంతులు , వర్దంతులు ,వివిధ దినోత్సవాలని NYK ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రమదానాలు,అవగాహన,చైతన్య సదస్సులు,,ర్యాలీలు,రక్తదానం తదితర కార్యక్రమాలని నిర్వహిస్తోంది.
నమోదు ప్రక్రియ :
           ఆసక్తి గల యువజన సంఘాలు NYK కార్యాలయానికి స్వయంగా వచ్చి అక్కడ ఉచితంగా లభించే ఫారం ని పూర్తి చేయాలి.దానికి సంఘం రిజిస్ట్రేషన్ జిరాక్స్ పత్రం జత పరిచి 10 రూపాయలు చెల్లించాలి.దానికి రసీదు, గుర్తింపునిస్తూ సర్టిఫికేట్ ని అధికారులు వెంటనే అందజేస్తారు.అనంతరం NYK పథకాలని వీరు పొందేందుకు అర్హులవుతారు..
ఆదిలాబాద్ జిల్లాలోని నెహ్రు యువ కేంద్రం యొక్క చిరునామా :



Adilabad Youth Coordinator ,
Nehru Yuva Kendra
H no 4-4-122/1
Highway Road
Adilabad
Andhra Pradesh 504001 


మరిన్ని వివరాలకి క్రింది వెబ్ సైట్ లని సందర్శించండి.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers