Tuesday, 20 March 2012

"మట్టిలో మాణిక్యం" సినిమా లోని "రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్" అనే పాటకి పేరడీ :

పల్లవి :
రిమ్ జిమ్ రిమ్ జిమ్ ఆదిలాబాద్
కొమరం భీమ్ జిందాబాద్
కలిసి కట్టుగా డెవలపు చేస్తే.. నగరాలన్నీ బలాదూర్ ..

చరణం :
అటు చూస్తే బాసర క్షేత్రం ..
ఇటు చూస్తే కుంటాల పాతం
ఆ వంక నిర్మల్ బొమ్మలు
ఈ వంక గుస్సాడీ డాన్సులు
గల గల పారే .. గల గల పారే గోదారి చందం
చూస్తే ఎంతో అందం ...
                                              "రిమ్ జిమ్ రిమ్ జిమ్"
చరణం :
ఒకవైపు గిరిజన దండు
మరు వైపు హరిజనం మెండు..
చెన్నూరు లో ఉత్తర వాహిని
తుమ్డి హెట్టి లో ప్రాణహిత నది
కొండలు కోనలు అరణ్యాలతో.....
వన దేవత యే మురిసే..
                                            "రిమ్ జిమ్ రిమ్ జిమ్"
చరణం :

గనులున్నా పనులే లేవు ..
వనరులున్నా వాడుక లేదు ..
నీరు లేక బీడయ్యే భూములు..
విద్య లేక లోకువయ్యే జనులు ..
ప్రగతి పథం లో నడిచే రోజు ...
ఎపుడొస్తుందో .. ఏమో..???
                                          "రిమ్ జిమ్ రిమ్ జిమ్"
***************
written by ME,
at 7:30pm 6.6.2011
***************
ఈ పేరడీ పాట సూర్య పేపర్ ఆదివారం సంచికలో
జులై 10 ,2011 నాడు ప్రచురితమైనది .........

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers