స్థల పురాణం , చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కోటిలింగాల క్షేత్రం చెన్నూర్ మండలం లో ఉంది. గోదావరి తీరంలో ఉన్న అతి ప్రాచీన శివాలయాల్లో కోటిలింగాల క్షేత్రం ఒకటి. కాశీ క్షేత్రాన్ని దర్శించి వచ్చిన భక్తులు కాశీ నుంచి తెచ్చిన గంగా జలాన్ని గోదావరి జలంతో కలిపి ,కోటి లింగేశ్వర స్వామిని పూజిస్తే కోటి లింగాలను పూజించిన ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. కోటిలింగాల స్నాన ఘట్టంలో స్నానం చేస్తే సర్వ కామ్య సిద్ధి, సర్వ రోగహరం, ఆయురారోగ్య, ఐశ్వర్యప్రదం కాగలదని భక్తుల విశ్వాసం.గోదావరి పుష్కరాల సందర్భంగా కోటి లింగాల రేవుని 40 లక్షల రూపాయలతో, 212 మీటర్ల పొడవునా అభివృద్ధి చేసారు. దీనిలో 162 మీటర్ల ఘాట్ పాతది కాగా ,కొత్తగా 50 మీటర్ల ఘాట్ నిర్మించారు. కోటిలింగాల ఘాట్ వద్ద ఉమాకోటి లింగేశ్వరాలయంతో పాటు , సారంగధరేశ్వర స్వామి, వరాహ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలున్నాయి.

No comments:
Post a Comment