Tuesday, 31 January 2012

బొగ్గు బావుల్లో బుగ్గు జీవనాలు

సిరులు కురిపించే సింగరేణి దినదినం కార్మికుల కుదింపుతో మసక బారుతుంది ఒకప్పుడు లక్ష 15 వేల కార్మిక కుటుంబాలకు ఉపాధిని పంచిన బోగ్గు తల్లి నేడు 65 వేలకు పడిపోయింది. దీంట్లో ప్రధానంగా గ్లోబులేషన్‌ పుణ్యమని ఈ పరిస్థితి దాపురించింది. పచ్చిని కుటుంబాల్లో ఆందోళనను మిగిల్చింది. పని కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ యంత్రాల సాయం బొగ్గు సేకరింపు చేస్తున్న కార్మిక సంఘాల ప్రశ్నించే లోపంతో అవి మరింత పెంచారు. అలాగే మహిళ ఉద్యోగుల సంఖ్యను సైతం తగ్గిస్తు వచ్చారు. ప్రపంచికరణ పేరిట పని ఎక్కువ జరగాలంటే ఓపెన్‌ కాస్టులను ఏర్పాటు చేశారు. దీంతో వంద మంది నెల రొజులు చేసే పనిని యంత్రాం ఒకే రొజు అందింపుతో అటు కార్మికుల పనిల తోలగింపు సాగింది.

అలాగే ఇటు బొగ్గు సైతం ఎక్కువ గా తరలింది.గతంలో లక్ష 15వేలు వున్నా కార్మికుల సంఖ్య ప్రసుత్తం 65వేలుగా సాగుతుందంటే తగ్గింపు ఏస్తాయిలో జరుగుతుందొ ఇట్టే అర్థమవుతుంది. నల్లని బొగ్గు బంగారం ఎక్కువ లభించిన కార్మికుల సంఖ్య పెరుగకుండనే సంపద తరలింపు సాగుతుంది. చిమ్మచీకట్టో బొగ్గు గృహల్లో పని చేసే కార్మికులకు రక్షణ సైతం అంతంతనేని తెలుస్తోంది. గొల్డన్‌ షేక్ హ్యాండ్ పేరిట కార్మికులకు వారసత్వ ఉద్యోగ చేరిక లేకుండ ముగింపు ను సైతం యాజమాన్యం చేపట్టింది. అవుట్‌ స్సోరింగ్‌ పేరిట కాంట్రాక్టు కార్మికులతో పని చేయిస్తూ పని అవగానే వారిని వదిలించుకుంటుంది. అయితే సంస్థ అభివృద్ధికి, యాంత్రీకరణే శరణ్యమని సింగరేణి యాజమాన్యం గట్టిగా విశ్వసిస్తోంది. దీంతో ఇక్కడి సింగరేణి కార్మికుల భవిష్యత్ కాస్త గందరగోళంలో పడింది. ఇక్కడి వారికి సింగరేణిలో ఉపాధి కరువయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers