May 2, 2011
హైదరాబాద్, మేజర్‌న్యూస్: రాష్ట్రంలో ఇసుకకు భారీగా డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారికంగా ఇసుక కాంట్రాక్టులు పొందినవారు కొందరైతే, రాజకీయ అండదండలతో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నవారు మరికొందరు. వీరికి అన్ని రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉండడంతో ‘వాల్టా’ చట్టానికి యధేచ్ఛగా తూట్లు పొడుస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఈ కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలుల అడుగంటిపోతున్నాయి.
దీనిని నిరోధించాల్సిన రెవెన్యూ, భూగర్భ, ఖనిజ విభాగ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన కరీంనగర్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా పరీవాహక జిల్లాలైన గుంటూరు, కృష్ణాలో ప్రజలు నీటికోసం అల్లాడుతున్నారు. భూగర్భ నీటిని, వృక్ష, భూ సంపదను పరిరక్షించడానికి ప్రభుత్వం వాల్టా చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం అమలులో అడుగడుగునా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం బాగా పుంజుకోవడంతో ఇసుకకు భారీగా డిమాండ్ ఏర్పడింది. జలయజ్ఞం పనులకు కూడా ఇసుక లక్షల టన్నుల్లో అవసరం ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
చివరకు గ్రామాల్లో చెరువులు, వాగులు, కాలువల్లో దొరికే ఇసుకను సైతం వదలడంలేదు. అయినప్పటికీ డిమాండ్ మేరకు ఇసుక సరఫరా కావడం లేదు. గత నెలలో కృష్ణా జిల్లాలో చందర్లపాడు మండలంలో ఇసుక కాంట్రాక్టు రూ.45 కోట్లకు ఓ కాంట్రాక్టరు దక్కించుకున్నాడంటే ఇసుకకు ఏమేరకు డిమాండ్ ఉందో అర్ధంచేసుకోవచ్చు. అక్రమ ఇసుక తవ్వకాలను అధికారులు అడ్డుకోవాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి అటువైపుకూడా చూడట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డగోలు ఇసుక తవ్వకాలు జరపడంతో పలు గ్రామాల ప్రజలు నీటికోసం వేయి అడుగుల బోరు వేసినా చుక్క నీరు లభ్యమవ్వడం లేదు.

No comments:
Post a Comment