Tuesday, 31 January 2012

నిప్పు.. ముప్పు

వేసవిలో వచ్చే ఇబ్బందులు కేవలం మండే ఎండలకే పరిమితం కాదు... అగ్ని ప్రమాదాలను కూడా వెంట బెట్టుకుని వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అగ్రి ప్రమాదాలు.. వాటి వల్ల వాటిల్లుతున్న ధన, ప్రాణ, ఆస్తి నష్టాలను చూస్తూనే వున్నాం. ఎక్కడో జరిగాయి మనకేం అని ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాల బారిన పడటం మాత్రం ఖాయం... దీని వల్ల ఆస్తి నష్టమే కాదు.. ప్రాణ నష్టం కూడా జరగక మానదు. అందుకే ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి నిపుణులు అందిస్తున్న సలహాలు.. సూచనలు


ఇలా చేయాలి...
Fire-Suppression
  • ప్రమాదవశాత్తు ఒంటికి నిప్పంటుకుంటే వెంటనే పరిగెత్త కూడదు. నేలపై దొర్లాలి. ఇలా చేస్తే మంటలు చాలా వరకు ఆరిపోతాయి. అందుబాటులో వుండే ఊలు వంటి వస్త్రాలను కప్పుకున్నా మంచిదే. 
  • శరీరం కాలితే వెంటనే నీరు పోయరాదన్నది అపోహ మాత్రమే.. నిజానికి కాలిన వ్యక్తిపై వెంటనే నీరు పోయాలి. 
  • పొగతో నిండిన గదుల్లో నిలబడకుండా పాకుతూ బయట పడాలి. ముక్కును, నోటికి అడ్డంగా గుడ్డను వుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొగ లోపలికి పోకుండా వుంటుంది.


  • పనిచేసే ప్రాంతాలు... 
    fire
  • పరిశ్రమల్లో ముందుగా పరిసరాల పరిశుభ్రత పాటించాలి. చెత్తా చెదారం పోగు కాకుండా ఎప్పటి కప్పుడు తొలగిస్తూ వుండాలి. 
  • పనిచేసే వారందరికీ అగ్ని మాపకాల గురించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించాలి. అవసరమైన శిక్షణ ఇవ్వాలి. 
  • అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఉన్న ప్రదేశాను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి.
  • పెద్ద పెద్ద మిషన్లతో పనులు చేసే చోట పరికరాల నుంచి అగ్గి రవ్వలు రాలకుండా జాగ్రత్తపడాలి. 
  • ప్రిఫెడ్‌ ఫైర్‌ సైటింగ్‌ నిబంధల మేరకు ఎల్లప్పుడూ సరిపడినంత నీటిని అందుబాటులో వుంచుకోవాలి. 
  • పనిచేసే స్థలాల్లో కనీసం మూడు ఫైర్‌ ఎక్సిట్‌లను ఏర్పాటు చేయాలి.

    నిల్వ చేసే ప్రాంతాలు....
  • వ్యాపారాలు లేదా నిల్వలకు సంబంధించి స్టాకును నిల్వ చేసే ప్రాంతాలు
    ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ వుండాలి.
  • స్టాకును చిన్న చిన్న చెక్క ముక్కలపైనే నిల్వచేయాలి. 
  • వేటికి వాటిని ప్రత్యేకంగా అమర్చాలి. వస్తువులను పేర్చడంలోనూ పద్ధతి పాటించాలి. 
  • 4, 5 మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ నిల్వచేయకూడదు. 
  • పై కప్పుకు కనీసం రెండు అడుగుల దూరం వుండాలి. 
  • వస్తువుల దిగుమతి, ఎగుమతి, సమయాల్లో ట్రక్కులు, ఇతర వాహనాల ఇంజన్లు
    ఆపివేయాలి. తరువాతే ఎగుమతి దిగుమతిలు చేసుకోవాలి. 
  • తగినంత గాలి, వెలుతురు వచ్చే ఏర్పాటు చేయాలి. 
  • స్టోర్‌ రూంల బయల వస్తువులు నిల్వ చేయరాదు. పొగతాగడం వంటివి నిషేధించాలి. 
  • తగినంత నీరు అగ్నిమాపక సామాగ్రి అందుబాటులో వుంచుకోవాలి.

    ఇళ్లలో...
    Wheelock
  • వంటింట్లో కింద, పైభాగాల్లో గాలి, వెలుతురు సక్రమంగా వుండేలా చూసుకోవాలి. 
  • గ్యాస్‌ ట్యూబ్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ వుండాలి. ఏ మాత్రం పాడైనట్లు అనుమానం వచ్చినా వెంటనే మార్చేయాలి. 
  • ఐఎస్‌ఐ మార్కు వున్న వస్తువులనే కొనుగోలు చేయాలి. 
  • ఎల్‌పీజీ లీక్‌ అవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్‌ ఆపివేయాలి. ఎలక్ట్రిక్‌ స్విచ్‌లు ఆన్‌ ఆఫ్‌ చేయరాదు. అగ్నిమాపక, గ్యాస్‌ కంపనీల సాయం కోరాలి. 
  • వంట గదిలో కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోలు, అదనపు గ్యాస్‌ సిలిండర్లు ఉంచుకోరాదు. 
  • ఇంటిని పరిశుభ్రంగా వుంచుకోవడంతోపాటు ఇంట్లోని వస్తువులను అల్మారాలు, షెల్ఫుల్లో సక్రమంగా ఉంచాలి. చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు లైటర్లు మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు.

    ఎలక్ట్రికల్‌ వస్తువులతో....
  • ఎలక్ట్రికల్‌ పాయింట్లు ఓవర్‌ లోడ్‌ చేయకుండా జాగ్రత్త పడాలి.వస్తువులను వుపయోగించకపోతే ఆపివేయాలి. 
  • నాణ్యమైన ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పరికరాలను మాత్రమే వుపయోగించాలి. 
  • సెలవులు, ఇతర కారణాలతో ఎక్కువ రోజులు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తే.. మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయాలి. 
  • ప్రమాద వశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పటానికి వీలుగా ఎల్లప్పుడూ కొంత నీటిని అందుబాటులో వుంచుకోవాలి.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers