Monday, 6 January 2014

చెన్నూరు మండల ప్రజా పరిషత్తు

చెన్నూరు మండలం భౌగోళికంగా 30161 హెక్టారులతో విస్తరించి ఉన్నది.
ఈ మండలానికి ఉత్తరాన కోటపల్లి మండలం ,
పడమర వైపు జైపూర్ మండలం,
తూర్పు, దక్షిణ దిశలలో గోదావరి నది సహజ సరిహద్దులుగా ఉన్నాయి.

పంచాయితీ సమితి కేంద్రంగా ఉన్న చెన్నూరు, చెన్నూరు మండల ప్రజా పరిషత్తుగా జనవరి 15, 1987న ఏర్పాటు చేయబడింది. మండలానికి తొలిసారి జరిగిన ఎన్నికలలో  మైదం సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులుగా గెలుపొందారు.

మండల ప్రజా పరిషత్తు పరిధిలో 17 గ్రామ పంచాయితీలు ఉన్నవి. అందులో 3 హరిజనులకు, 2 గిరిజనులకు ప్రత్యేకించబడినవి.


No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers