Saturday, 8 September 2012

గోండు రాజుల గాంధారి ఖిల్లా


mnclrcగోండు రాజుల కాలం నాటి శిల్ప కళలు రాష్ర్టంలోనే అతి తక్కువ. అందులోనూ తెలంగాణలో అరుదు. అలాంటి అపురూపమైన శిల్పకళలు గాంధారి ఖిల్లాలో కనిపిస్తాయి. గాంధారి ఖిల్లా ప్రాంతాన్ని ‘గాంధారి లొద్ది’గా పరిగణించే వారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని గోండు రాజులు పరిపాలన చేసే వారని అంటారు. వీరి పాలనలో ఉన్న ప్రాంతమే గాంధారి ఖిల్లా. గోండు రాజులు క్రమంగా నైజాం నవాబుకు సామంతులుగా మారారు. వీరి పాలనలో భూమి అంతా భూస్వాముల చేతులలో ఉండేది. ఈ భూస్వాముల ఆగడాలు అంతా ఇంతా కాదు.

ప్రజలతోని పొలాల్లో, ఇండ్లలో వెట్టి చేయించే వారు. వారి కన్నుపడ్డ కన్యలపై కూడా అత్యాచారాలు చేసేవారని తెలుస్తోంది. ఈ దొరల వద్ద భూములు కౌలుకు తీసుకున్న వారి పంటల్లో సగం చెల్లించే వారని, పంట పండినా, పండకపోయినా తప్పకుండా దొరలకు సగం వాటా చెల్లించాల్సిందే. అని చరిత్రకారులు అంటారు. లేదంటే శరీరమంతా వాతలు పెట్టడం, ఒక్కోసారి చంపేయడం లాంటివి జరిగేవి. తెలంగాణలో దొరలు, దేశ్‌ముఖ్‌ల నేతృత్వంలో భూస్వామ్య వ్యవస్థ ఉండేది. దొర ఇంట్లో పెండ్లి అయితే గ్రామ మహిళలు అంతా వడ్ల దంపుడులకు వెళ్లాల్సిందే. గొల్లలు గొర్రెలు ఇవ్వాల్సిందే. నైజాం రాజ్యాన్ని పోలీసు చర్యతో భారత సైన్యాలు హస్తగతం చేసుకున్నాక గాంధారి లొద్దిలో స్వాతంవూతపు గాలులు స్వేచ్ఛగా వీచాయి. కాని గాంధారి ఖిల్లాను మాత్రం పాలకులు అలాగే వదిలేశారు. గోండు, గిరిజన శిల్పులు ఈ గాంధారి ఖిల్లాను ఒక గుట్టలోనే చెక్కారని చెబుతారు. సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఖిల్లా ప్రసిద్ధిగాంచింది.

mnclrc2ఆదిలాబాద్ జిల్లాలోని గోండు రాజుల గురించి కథలు కథలుగా, వీరగాథలుగా స్థానికులు చెబుతారు. వారి కట్టడాలు నేటికి నిలిచిపోయాయి. కొమురం భీం, రాంజీ గోండ్ పోరాట త్యాగాల చరిత్ర ఒకవైపు ఉండగా అలనాటి కట్టడాలు కూడా చరివూతపుటల్లో ఎక్కకుండానే ఉండిపోయాయి. అందుకు నిదర్శనం జిల్లాలోని మందమర్రి, మంచిర్యాల మధ్యన నాగ్‌పూర్ - హైదరాబాద్ రహదారి పక్క నుంచి సుమారు 12 కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతం నుంచి తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కేంద్రం నుంచి పాలవాగు దాటి వెళితే కనిపించే ఒక పెద్ద గుట్ట... ఆ గుట్టనే గాంధారి ఖిల్లాగా పిలుస్తారు. అందులోకి ప్రవేశిస్తే అంతా అశ్చర్యమే! గిరిజన శిల్పులు, కళాకారులు చెక్కినవిగా చెప్పే అద్భుతమైన శిలారూపాలు అక్కడ మనకు కనిపిస్తాయి.

mnclrc1లోపల రెండు దేవాలయాలు, సొరంగ మార్గం, పెద్ద నాట్య స్థలం, లైట్లతో చూస్తే కనిపించే ఒక దేవి విగ్రహం, పడగతో ఉన్న నాగుపాము, ఏనుగు బొమ్మలు, మైసమ్మ, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు బండకే చెక్కి కనిపిస్తాయి... లోపల ప్రథమ ద్వారం కాపలా దేవుళ్ల గుడి, ద్వితీయ ద్వారం వద్ద మైసమ్మ గుడి, నంది గుడి, ఖిల్లాపై మూడు మంచినీటి బావులు (ఎప్పటికి కొలనులో నీరు ఎండిపోకుండా ఉంటాయి) కనిపిస్తాయి... ఈ బావుల లోతు ఎనిమిది నులమ మంచాలంత ఉంటుందంటారు. ఈ బావులను ‘సవతుల బావులని’ పిలుస్తారు. బయట ఒక నీటి మడుగు ఉంటుంది. గుట్ట బండపై చాలా చోట్ల పాము పుట్టలు ఉన్నాయి. బావులలో ఏనుగులు వచ్చి నీళ్లు తాగేటివని చెబుతుంటారు. ఖిల్లా చివరివరకు మెట్లు గుట్టకే చెక్కబడి ఉంటాయి... ఈ నీటి మడుగు చాలా లోతుంటుందని చెబుతారు.

దీని ముందు ఒక పెద్ద ఊర చెరువు ఉంది. దీని కింద వందల ఎకరాలు వ్యవసాయం చేస్తుండేవారని తిమ్మాపూర్ గ్రామస్తులు చెబుతుంటారు. కాసిపేట మండలంలోని కొత్తగఢ్‌పూర్ గ్రామానికి చెందిన రెడ్డ గోండులు ఇక్కడ పూజారులుగా వ్యవహరించారని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణ ఎలాగయితే అభివృద్ధికి దూరమయి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురయిందో అదే నిర్లక్ష్యానికి గురయింది గాంధారి ఖిల్లా. రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ నాయక్‌పోడ్ గిరిజనులు జాతర జరుపుకుంటారు. గత పదేండ్ల క్రితం ఒకసారి ఈ గుట్టల్లో ఎన్‌కౌంటర్ కూడా జరిగి ముగ్గురు పనిబాగ్చీ గ్రూపుకు చెందిన వారు మరణించిన దాఖలాలు ఉన్నాయి. గిరిజన కళాసంపదలతో ఒక్కటైన ఈ గాంధారి ఖిల్లాను ఇక తెలంగాణ వస్తే తప్ప కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికి కొంత మంది పర్యాటకులు అప్పుడప్పుడు గాంధారి ఖిల్లా వరకు పిక్‌నిక్‌లకు, పూజలకు వెళుతుంటారు.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers