Tuesday, 13 March 2012

సంగీత శిరోమణి -జక్కెపల్లి నాగేశ్వర్ రావు

సి.నారాయణ రెడ్డి తో నాగేశ్వర్ రావు 

జక్కెపల్లి నాగేశ్వర్ రావు..
కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో రాణిస్తూ..జిల్లా కీర్తిని నలు దిశలా  
చాటుతున్నాడు. గజల్స్ పాడటంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందారాయన. 
             చెన్నూర్ పట్టణానికి చెందిన నాగేశ్వర్ రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.ఆయన తండ్రి జక్కెపల్లి కిష్టయ్య కూడా సంగీత కచేరీలు ఇచ్చిన ఘనాపాటి. తండ్రి శిక్షణలో నిరంతరం సాధన చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు. 

తెలుగు, మరాఠీ , హిందీ, ఉర్దూ, సంస్కృత భాషల్లో పాడగల నైపుణ్యాన్ని సాధించారు. తన సంగీత కచేరీలతో సంగీత ప్రియుల మన్ననలతో పాటు , డా.సి.నారాయణ రెడ్డి , మాడుగుల నాగఫణి శర్మ ,యక్క వెంకటేశ్వర్లు, గుమ్మడి వంటి పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందారు.  
ఆలిండియా రేడియో ఆధ్వర్యంలో హైదరాబాద్,ఆదిలాబాద్ కేంద్రాల్లో అనేక కచేరీలు చేసారు.మహారాష్ట్రలోని సిరోంచ , నాగపూర్ వంటి పట్టణాల్లో ఎన్నో ప్రదర్శనలిచ్చారు.ప్రముఖ కవి,వానమామలై వరదాచార్యులు రచించిన గీత్ రామాయణం ను అద్భుతంగా గానం చేశారు.భక్తి పాటలకి సంగీతాన్ని, స్వరాలని సమకూర్చారు.
                  2006 మార్చి 28 న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో 12 గంటల పాటు సంగీత కచేరి చేసి దక్షిణాది రికార్డు నెలకొల్పారు.. దీనికి గుర్తింపుగా ఆయనకి ఆ అకాడమీ వారు సంగీత శిరోమణి అవార్డుని ప్రధానం చేసారు. అంతే కాదు అనేక పద్య కావ్యాలు కూడా రచించారు.. ఆయన ప్రభావంతో ఎంతో మంది విద్యార్థులు పద్య రచన మొదలు పెట్టి, అనేక శతక రచనలు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు..ఇక వీరి  సోదరులు ముక్తేశ్వర్,మధుకర్, హిమకర్ లు కూడా సంగీతంలో దిట్టలే. 

అందుకున్న పురస్కారాలు:

బెంగుళూర్ లో 1993లో దేశ స్థాయిలో నిర్వహించిన గజల్ పోటీల్లో 840మందిలో 15 మందిని ఎంపిక చేసారు.అందులో నాగేశ్వర్ రావు ప్రథమ బహుమతి పొందారు.
1997లో ఆదిలాబాద్ జిల్లా ఫెస్టివల్ త్యాగరాయ గానసభలో సంగీత శిరోమణి అవార్డు అందుకున్నారు. 
1997లో సాంస్కృతిక సమాఖ్య వారిచే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు.
1994లో జిల్లా సాంస్కృతిక సమాఖ్య వారిచే సంగీత సామ్రాట్ బిరుదు పొందారు.
మార్చి 14, 1999లో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ వారిచే ఉత్తమ సంగీత పండితుడిగా అవార్డు అందుకున్నారు.
   
ఈయనకి సంబంధించిన వీడియో క్లిప్స్ ని క్రింది లింక్ లో చూడండి : 

http://www.youtube.com/watch?v=VWdmzNQvUAY&noredirect=1 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers