మేడారంలో నిర్వహించినట్లే, కోల్ బెల్ట్ ఏరియా లో సంప్రదాయ పద్ధతిలో సమ్మక్క-సారలమ్మలని గద్దెలకి తీసుకు వచ్చి పూజలు చేస్తారు..
సింగరేణి కార్మికులు మేడారం వెళ్లి మొక్కులు తీర్చుకొని రావడానికి దూరాభారం కావడంతో పాటు, పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేది..గనుల్లో గైర్హాజరుతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగేది..దీన్ని అధిగమించేందుకు యాజమాన్యం సమ్మక్క-సారలమ్మ గద్దె లని ఏర్పాటు చేసింది.. ఇక్కడ మేడారం ను మైమరపించేలా జాతరని ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు.. చుట్టూ పక్కల ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు..
రామకృష్ణాపూర్ లోని పాలవాగు ఒడ్డున గల అటవీ ప్రాంతంలో సమ్మక్క-సారలమ్మలని గద్దెలున్నాయి.
1998లో మొదటిసారిగా ఇక్కడ జాతర ప్రారంభమైంది.. దీనిని అప్పటి రామకృష్ణాపూర్ ఏరియా జనరల్ మేనేజర్ పవజ్ కర్ ప్రారంభించారు..జాతర సమయంలో మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం విద్యుత్,మంచి నీటి సౌకర్యం ,రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు, గద్దేలని అందంగా ముస్తాబు చేస్తారు.. జాతర స్థలంలో శాశ్వతంగా నిర్మించిన ట్యాంకులకు తాగునీటిని సరఫరా చేసేందుకు సమీపంలోని RK-1A గని నుండి పైపు లైను నిర్మించారు..
చెన్నూర్ పట్టణానికి సంబంధించిన దేవరం మధునయ్య కుటుంబీకులు 60 ఏళ్ళ క్రితమే పట్టణంలో సమ్మక్క-సారలమ్మలని గద్దెలని నిర్మించారు.. ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఈ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు..మొదట్లో వందల సంఖ్యలో వచ్చే భక్తులు కొంతకాలంగా వేలాదిగా తరలి వస్తున్నారు..
చెన్నూర్ పట్టణంలోని జాతీయ రహదారికి సమీపంలో ఉన్న బతుకమ్మ వాగు వంతెన వద్ద ఈ గద్దెలు ఉన్నాయి.. అక్కెపల్లి అటవీలోని కంకవనం నుండి గిరిజన పూజారులు అమ్మ వార్లను మేళ తాళాలతో ఈ గద్దెలకి తీసుకు వస్తారు..
చెన్నూర్ తో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఒడిబాల బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు..
ఇలాగే కిష్టంపేట, సుబ్బరాం పల్లి గ్రామాల్లో కూడా గద్దె లు ఏర్పాటు చేసి, భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఇక కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామ సమీపంలో ఉన్న గోదావరి నదీ ఒడ్డున ఉన్న సమ్మక్క- సారలమ్మ ఆలయంలో కూడా జాతర నిర్వహిస్తారు.. జైపూర్ మండలంలో కూడా 60 ఏళ్ళుగా జాతరని జరుపుతున్నారు..

No comments:
Post a Comment