ప్రతిరోజు వేలాది మందికి రక్తం అవసరమవుతోంది.ముఖ్యం గా గర్భిణీలలో రక్తహీనత, తలసేమియ వ్యాధిగ్రస్తులు, ఎనిమియ గలవారికి శస్త్ర చికిత్సల్లో, ప్రమాదాల్లో గాయాలపాలైన వారికి ఎక్కువగా రక్తం అవసరమవుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం దాతలు ముందుకు వస్తున్నా, గ్రామీణ ప్రాం తాల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండడంతో దాతలుముందుకు రావడం లేదు.రక్తం ఇస్తే తిరిగి రాదనేఅపోహాలు ఉండటమే దీనికి కారణం.
కాని రక్తదాతకు 24గంటల్లోపు తిరిగి రక్తం వస్తుంది. 18-60 సంవత్సరాల వయస్సుగల వారు, 40 కిలోల పైబడి బరువుఉన్నవారు,60-100 సార్లు నిమిషానికి నాడి కొట్టుకునేవారు, 100 నుంచి 180సిస్టాలిక్, 50-100 ఎంఎం డయస్టాలిక్, 100మి.గ్రాం రక్తంలో 12.5 గ్రాముల హిమోగ్లోబిన్ కలిగిన వారు రక్తదానం చేయడానికి అ ర్హులు.
అలాగే రక్తదానం చేసేటప్పుడు రక్తదాతకు తీవ్రమైన వ్యాధులు, మూర్చు, హెపటైటిస్‌బి, ఎయిడ్స్, సుఖవ్యాధులు, కొన్నిరకాల వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయవద్దు.
ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్త దానం చేయవచ్చు. రక్తదానం చేయడం వాళ్ళ వేరొకరి ప్రాణాల్ని కాపాడిన వారమవుతాం.
అందుకే రక్తదాన విలువని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14 న ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని జరుపుతారు.

No comments:
Post a Comment