వ్యవసాయం ఎక్కువ వర్షాధారితం.చెరువులు, వ్యవసాయ బోర్ల ద్వారా కుడా సాగుచేస్తారు.. నియోజక వర్గంలో ఒక్క గొల్లవాగు ప్రాజెక్టు తప్ప మరెక్కడా ప్రాజెక్టులు లేవు.చిన్నతరహా నీటిపారుదల చెరువుల ద్వారా నియోజక వర్గంలో సుమారు 20 వేల ఎకరాలకి నీరందుతోంది.గోదావరి, ప్రాణహిత లాంటి జీవనదులున్నా, నీరు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. మండలాల్లో సుమారు వెయ్యికి పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. భూగర్భ జల మట్టం పడిపోవడంతో, బోర్లు పనిచేయని పరిస్థితి నెలకొంది.. దీనికి తోడు కరెంట్ కోతలు కూడా అధికం. చెరువులు,కుంటలు ఎండిపోయాయి. చెన్నూర్ మండలంలో 15 వేల ఎకరాలకి, కోటపల్లిలో 9 వేల ఎకరాలకి, జైపూర్ లో 17 వేల ఎకరాలకి, మందమర్రిలో 3 వేల ఎకరాలకి సాగునీరు అందుతోంది.
జైపూర్ మండలంలోని గొల్లవాగు ప్రాజెక్ట్ ని ప్రారంభించినా పంట పొలాలకి సాగునీరు అందడం లేదు. డిసెంబర్ 18,2005 సంవత్సరంలో 9500 ఎకరాలకి సాగునీరు అందించాలనే లక్ష్యం తో 83కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ .రాజశేఖర్ రెడ్డి దీనికి శంఖుస్థాపన చేసారు.. ఈ ప్రాజెక్టుని 2009లో ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసారు.ఈ ప్రాజెక్టుకి నాసిరకంగా కాలువలు నిర్మించడం వల్ల రివిట్ మెంట్ పూర్తిస్థాయిలో లేదు.

No comments:
Post a Comment