చెన్నూర్ నియోజక వర్గం ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.. ఇక్కడి ఆలయాలు పూర్వ వైభవానికి ఆనవాళ్ళు. ఇక్కడ బొగ్గు నిక్షేపాలు, అటవీ సంపదలు పుష్కలంగా ఉన్నాయి..చెన్నూర్ , కోటపల్లి మండలాలు ప్రాణహిత నదీ తీరాన్ని ఆనుకొని ఉన్నాయి..
పట్టణ సమీపంలో అత్యంత పవిత్రమైన పంచ క్రోశ ఉత్తర వాహిని (గోదావరి) నది పారుతుంది..ఇందులో పుణ్య స్నానం ఆచరిస్తే కాశీ లో పుణ్య స్నానం ఆచరించినంత పవిత్రత సంతరించు కుంటుందని భక్తుల విశ్వాసం..
ఇక చెన్నూర్ పట్టణం లోని అంబా అగస్తేశ్వర ఆలయం, జగన్నాధ ఆలయం చారిత్రక ప్రాముఖ్యతని కలిగి ఉన్నవి.. ఇక్కడి జగన్నాధ ఆలయం..చారిత్రకంగా చూస్తే, ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాధ ఆలయం తరవాత ,దేశంలో నిర్మించ బడిన రెండో జగన్నాథ ఆలయం..
ఇక చెన్నూర్ మండలంలోని కత్తేరశాల మల్లికార్జున స్వామి దేవాలయం.., సుద్దాల లోని రామాలయం ఎంతో ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ..

మండలంలోని కోటిలింగాల ప్రాంతం,సోమన పల్లి లోని L.మడుగు చూడదగ్గ
ప్రదేశాలు..
జైపూర్ మండలం లోని వేలాల మల్లికార్జున స్వామి దేవాలయం, కుందారం లోని కుంభ మాంభ శాసనాలు చారిత్రక ఆనవాళ్ళుగా మిగిలాయి.. కోటపల్లి మండలంలోని పారిపెల్లి లో భైరవ కొండ, అర్జున గుట్ట వద్ద ఉన్న ప్రాణహిత నదీ తీరాలు పర్యాటక ప్రదేశాలు.. మందమర్రి మండలంలోని తిమ్మాపూర్ పంచాయితీ పరిధిలోని గాంధారి ఖిల్లా చారిత్రక , పర్యాటక ప్రదేశంగా చెప్పుకోవచ్చు.. ఇక్కడ కాకతీయ సామంత రాజులు,ఒడ్డె రాజుల పాలన నాటి రాతి విగ్రహాలున్నాయి..

No comments:
Post a Comment