పిల్లలు లేని దంపతులకి దత్తత ఒక వరం లాంటిది. మహిళా శిశు సక్షేమ శాఖ (ICDS)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహలో అనాధ శిశువు లెందరో సంరక్షించబడుతున్నారు. అందులో పెరిగే పిల్లలని పెంచుకోవాలనుకునే వారు చట్టపరంగా దత్తత తీసుకోవచ్చు.
నిబంధనలు :
నిబంధనలు :
- దంపతులు దత్తత తీసుకోవాలంటే ఆ దంపతులకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు జారీ చేసిన ధృవీకరణ పత్రం తప్పనిసరి.
- పిల్లలు దత్తత తీసుకునే దంపతులలో ఏ ఒక్కరి వయస్సు 55 సంవత్సరాలు మించకూడదు.
- 45 ఏళ్ళ వయసున్న దంపతులు నెలలు నిండిన పాప నుంచి ఒక ఏడాది వయసు గల పిల్లలను దత్తత తీసుకోవడానికి అర్హులు. వీరి సగటు ఆదాయం నెలకి రూ.5 వేలు ఉండాలి. దత్తత తీసుకున్న పిల్లలని పోషించగల స్తోమత ఉండాలి.
- పెళ్లి కాని మహిళలు,పురుషులు, వితంతువులు, ఎవరైనా పిల్లలని దత్తత తీసుకోవచ్చు.కానీ తీసుకునే ముందు షురిటీ సంతకం పెట్టాలి.
- విడాకులు పొందిన,పెళ్లి కాని వ్యక్తుల వయస్సు 30-45 సంవత్సరాల మధ్య ఉండాలి.దత్తత కోరే ఒంటరి తండ్రి/తల్లి కి , పిల్లల మధ్య వయోభేదం 21 సంవత్సరాలు ఉండాలి.
తల్లిదండ్రుల వయసు - బిడ్డ వయసు గ్రూపు
46 సంవత్సరాలు 1-2 సంవత్సరాలు
47 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు
48 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు
49 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు
50 సంవత్సరాలు 5-14 సంవత్సరాలు
దరఖాస్తు చేసే పద్ధతి :
శిశువుల్ని దత్తత తీసుకునే పిల్లలు ముందుగా మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించాలి.
నెలసరి ఆదాయ ధృవపత్రం ,స్థిరాస్తులు , వైద్యులు ధ్రువీకరించిన పత్రాలతో ICDS PDకి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న వారి పూర్తి వివరాలు పరిశీలించి వారికి నమ్మకం కలిగితే శిశువుని అప్పగిస్తారు.
దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలకి క్రింది వెబ్ సైట్ ని సందర్శించండి.

No comments:
Post a Comment