రామకృష్ణాపూర్ కి చెందిన సింగరేణి కార్మికుడు మల్లేష్-మనోహర దంపతుల కుమారుడు భాస్కర్.అక్కడే సింగరేణి పాఠశాలలో విద్యను ఆరంభించి,పాలిటెక్నిక్ , మెకానికల్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు.. ఒకరోజు ఎక్కడో మ్యాజిక్ షో చూసి, తాను కూడా అలాగే చేయాలని అనుకోని, పుస్తకాలు, వీడియో సీడీ ల ద్వారా అనుకరించి నేర్చుకున్నాడు..
గురువు లేకున్నా,స్వతహాగా శ్రమించి కార్యసాధనలో సఫలుడయ్యాడు. తన తొలి ప్రదర్శనను 1991 లో తాను విద్యనభ్యసించిన సింగరేణి పాఠశాలలో ప్రదర్శించి భేష్ అనిపించుకున్నాడు.. అప్పటి నుండి వెనుదిరిగి చూడలేదు.కొత్త కొత్త అంశాలని నేర్చుకుంటూ అందరినీ మెప్పించాడు.వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొని బహుమతులు సాధించారు.తన ప్రదర్శనల ద్వారా వచ్చిన మొత్తాన్ని పలు సేవా కార్యక్రమాలకి వినియోగించి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు.
స్వచ్చమైన భారతీయ ఇంద్రజాలం ,మ్యాజిక్ లో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావించే ఇల్యూషన్స్(భ్రమలు) ప్రదర్శన కూడా భాస్కర్ కి కొట్టిన పిండే.కాగితం ముక్కల నుండి వందలాది కరెన్సీ నోట్లని సృష్టించడం ,నిలువెత్తు మనిషిని గాలిలో ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టడం,మనిషి దేహాన్ని రంపంతో కోసి మూడు ముక్కలుగా చూపటం,వేదికపై నుంచి మాయమై ప్రేక్షకుల మధ్య ప్రత్యక్షమవ్వటం తదితర ప్రదర్శనలు ప్రేక్షకులని మాయాలోకానికి తీసుకువెళ్తాయి.
సాధించిన బహుమతుల్లో కొన్ని:

- బెంగుళూర్ లో జరిగిన అఖిల భారత మ్యాజిక్ ఫెస్టివల్ లో బహుమతి.
- బీహార్ లో జరిగిన అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్ లో ప్రథమ బహుమతి పొందాడు.
- హైదరాబాద్ లో నిర్వహించిన మాయా వినోదంలో బహుమతి.
- 2002 ,2003 సంవత్సరాలలో కోల్ కతా, న్యూ ఢిల్లీ, చెన్నై లలో జరిగిన పోటీల్లో ఉత్తమ మెజీషియన్ అవార్డులని పొందారు.
- రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతులు పొందారు.
- త్రివేండ్రం లో జరిగిన అంతర్జాతీయ ఇంద్రజాల పోటీలలో రెండో స్థానం.
- ఇప్పటి వరకు 8 దేశాల్లో ప్రదర్శనలిచ్చారు.
No comments:
Post a Comment