Wednesday, 14 March 2012

గోదావరి- ప్రాణహిత పుష్కరాలు

ప్రాణికోటికి జీవనాధారమైన నీటిని గౌరవించి, పూజించే సమున్నత సంప్రదాయానికి వేదిక పుష్కరం. దేశంలోని 12 ప్రధాన నదుల్లో,ఏటా ఒక నదికి జరిగే ఈ 12 రోజుల నదీ ఉత్సవాలు సమైక్యతని ప్రభోదించే భారతీయ సంస్కృతి వైభవానికి నిదర్శనాలు. 
            మన నియోజక వర్గం విషయానికి వస్తే , ఇక్కడ ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. కాబట్టి పుష్కరాల సమయంలో ఇక్కడ సందడి నెలకుంటుంది.

గోదావరి పుష్కరాలు- విశిష్టత :


అన్ని నదుల్లాగే గోదావరికి కూడా 12 ఏళ్ళకి ఒకసారి తనలో పుష్కరుడు ప్రవేశించిన సందర్భంగా పుష్కరాలొస్తాయి. అంతే కదా అనుకోవడం పొరబాటు. పవిత్రమైన గంగా నదిలో 60 వేల సార్లు స్నానం చేసిన ఫలితం పుష్కర గోదావరిలో ఒక్కసారికే లభిస్తుందని మన పురాణాలు స్పష్టం చేసాయి.


శ్లోకం:    సింహరాశింగతే-స్వర్గే మర్త్యే రసాతలే !
          యానివై సంతి తీర్థాని గౌతమ్యాం తాని సంతిహి !!


అర్థం:  బృహస్పతి సింహ రాశి యందున్నప్పుడు, సమస్త లోకములందలి పుణ్య తీర్థములును, గోదావరి యందే చేరి యుండును. అనగా పుణ్యార్థులు ఆ సమయంలో గోదావరిలో స్నానం చేయాలి.ఇంకా ఏ నదిలో చేసినా అంత పుణ్యం లభించదు.  
గోదావరి పుష్కరాలు ఇటీవలి కాలంలో 2003 సంవత్సరంలో జూలై 30 నుండి ఆగస్ట్ 10 వరకి జరిగాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అత్యంత ఘనంగా జరిపిన పుష్కరాలు ఇవి. మళ్లీ 2015 లో ఈ పుష్కరాలు జరుపబడుతాయి.


ప్రాణహిత పుష్కరాలు- విశిష్టత :


2010 డిసెంబరు 6 నుంచి 17 వరకు పన్నెండు రోజుల పాటు నిర్వహించిన ప్రాణహిత పుష్కరాలను మన ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. పన్నెండేళ్లకోసారి ప్రతీ నదికి పుష్కరం జరిగినా ప్రాణహితకు ప్రభు త్వం అధికారికంగా పుష్కరం నిర్వహించడం ఇదే మొదటిసారి.. పుష్కరాల కోసం కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా తుమ్డిహేటి, వేమనపల్లి, అర్జునగుట్ట వద్ద ఏర్పాట్లు చేసింది.  ప్రాణహితకు గతంలో 1999 జనవరి 12-23 తేదీల మధ్య పుష్కరాలు జరిగాయి. 
 ప్రాణహిత 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers