జైపూర్ మండలంలోని వేలాలలో మల్లన్న గుడి కూడా చాలా ప్రసిద్ధమైనది.శివరాత్రి రోజు మల్లన్న గుడితో పాటు, సమీపంలో గుట్టపై ఉన్న, గట్టు మల్లన్న దేవాలయాలు కూడా జాతరకి సిద్ధమవుతాయి. జాతరలో భాగంగా భక్తులు బోనాలు పోసి ,పట్నాలు వేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు.
స్థల పురాణం విషయానికి వస్తే.. వేలాలకు చెందిన పోగుల పుల్లు అనే బాలుడు తన పశువులని కాసేందుకు , గుట్టపై గల దోన వద్దకి వెళ్లి అక్కడే పశువులని మేపుతూ ఉండేవాడని, మల్లన్న స్వామిని పేరుతో పిలిస్తే ఆ బాలుడు పలికే వాడని చెప్పుకుంటారు. అలాగే అతని పశువులు ఎటూ వెళ్ళకుండా అక్కడే మేస్తూ ఉంటుండటం తో తోటి కాపరులు దీన్ని గమనించారు. మల్లన్న స్వామిని దూషించగా అప్పటినుండి దేవుడు పలకడం మానివేయగా పుల్లు కూడా మాయమై పోయాడని చెబుతారు. అప్పటినుండి గుహలో ఉన్న లింగాన్ని పూజించడం ప్రారంభించారు. ఈ గుహలో ఏ కాలంలో అయినా శుద్ధ జలం ఉంటుందని చెప్పుకుంటారు.

No comments:
Post a Comment