చెన్నూర్ మండల కేంద్రానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో మల్లికార్జున స్వామి కొలువుదీరిన కత్తెరశాల గ్రామానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయాని నిర్మించారు. ఇక ఇదే పంచాయితీ పరిధిలోని నారాయణపూర్ సరిహద్దున ఉన్న ఉత్తర వాహిని కోటిలింగాల వద్ద అగస్త్య మహాముని స్నానమాచరించి అక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా కత్తెరశాల మల్లన్న దేవాలయానికి చేరుకొని పూజలు నిర్వహించేవారని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది.
గ్రామంలోని యాదవులు మల్లన్న స్వామిని ఆరాధ్య దైవంగా భావించి పూజలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది.శివ పార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలకు దాదాపు 20 వేల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. చెన్నూర్ పరిసర ప్రాంతాల్లో ఉత్తర వాహినిగా పేరున్న గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి మల్లన్న స్వామిని దర్శించుకుంటే మోక్షం సిద్దిస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల భక్తులు విధిగా బోనాల కార్యక్రమం తప్పని సరిగా నిర్వహిస్తుంటారు.ఆలయం ఎదురుగా ఉండే రావి చెట్టు కింద ఉండే నాగేంద్రుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

No comments:
Post a Comment