ఉద్యోగ రీత్యా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ పై వెళ్ళేటప్పుడు మనకి నిత్య అవసరాలు,అయిన క్రింది వాటిని బదిలీ అయిన ప్రాంతంలో పొందేందుకు ఎలా బదిలీ చేసుకోవచ్చో తెలుసుకుందాం :
రేషన్ కార్డు బదిలీ :
రేషన్ కార్డు బదిలీ గురించి మీ ప్రాంతంలోని తహసీల్దార్ కి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి.బదిలీ గురించి తెలుపుతూ,కొత్త చిరునామాని పొందుపరుస్తూ దరఖాస్తు చేయాలి. దీనితో పాటు రేషన్ కార్డుని కూడా అప్పగించాలి.రేషన్ కార్డుని స్వాధీనం చేసుకున్నట్లుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం ఇస్తారు.ఈ ధృవీకరణ పత్రాన్ని జత చేస్తూ ,బదిలీ అయిన ప్రాంతంలోని ,తహసీల్దార్ కి దరఖాస్తు చేసుకోవాలి.అధికారులు వీటిని పరిశీలించి కొత్తగా రేషన్ కార్డుని జారీ చేస్తారు. ఇలా కొత్త చిరునామాతో రేషన్ కార్డుని పొందవచ్చు.
గ్యాస్ బదిలీ :
ముందుగా బదిలీ వివరాలు తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్న గ్యాస్ డీలర్ కి దరఖాస్తు చేయాలి. గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు ,గ్యాస్ సిలిండర్ , రెగ్యులేటర్ లని ఏజన్సీ కి అప్పగించాలి.వీటిని తీసుకున్న గ్యాస్ ఏజన్సీ వారు డిపాజిట్ సొమ్ముతో పాటు టెర్మినేషన్ ఓచర్ ని వినియోగదారునికి ఇస్తారు.ఈ టెర్మినేషన్ ఓచర్ ని తీసుకు వెళ్లి బదిలీ అయిన ప్రాంతంలోని గ్యాస్ ఏజన్సీ కార్యాలయంలో ఇవ్వాలి. కొత్త చిరునామా వివరాలని వారికి తెలియజేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా వెంటనే గ్యాస్ సిలిండర్ ,రెగ్యులేటర్ , కనెక్షన్ కి సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తారు.ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి బదిలీ పై వెళ్ళిన సందర్భంలో ఇది తప్పనిసరి.
జీవిత బీమా :
LIC బ్రాంచీ లన్నీ ప్రస్తుతం ఆన్ లైన్ సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి.ఎక్కడి నుంచైనా ప్రీమియాన్ని చెల్లించవచ్చు. తపాలా చిరునామా మారాలంటే ,మారిన చిరునామా, పాలసీ వివరాలతో సంబంధిత కార్యాలయంలో ఓ దరఖాస్తు అందజేస్తే ప్రీమియం రసీదులు నేరుగా నేరుగా మీరు ఇచ్చిన చిరునామాకే వస్తాయి.
బ్యాంకు ఖాతా మార్పు:
ఖాతా బదిలీ కోసం బ్యాంకులో లభ్యమయ్యే ఒక పత్రంలో వివరాలని పూర్తి చేసి ,బ్యాంకు ఖాతా నంబరు, సొమ్ము నిల్వ, ATM తదితర వివరాలని తెలపాలి. దీన్ని బ్యాంకులో సమర్పిస్తే బదిలీ అయ్యే ప్రాంతానికి బ్యాంకు ఖాతాని బదిలీ చేస్తారు.
పోస్టల్ ఖాతా మార్పు:
పొదుపు పత్రాలు, సేవింగ్ ఖాతాలు , రికరింగ్ డిపాజిట్లు తదితరాలని బదిలీ చేసుకోవడానికి , తపాలా కార్యాలయాల్లో లభించే S.B.-10 ఫారాన్ని నింపి దరఖాస్తు చేసుకోవాలి.మీరు పొందు పరిచిన చిరునామాకి 15 రోజుల్లో బదిలీ అవుతాయి.

No comments:
Post a Comment