భౌగోళికంగా చెన్నూర్ పట్టణం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆగ్నేయ దిశలోఉత్తర అక్షాంశానికి 18°51′21″N , అలాగే 79°48′03″E
తూర్పు రేఖాంశానికి మధ్యలో ఉంది..
చెన్నూర్ మండలానికి ఉత్తరాన కోటపల్లి మండలం ,
పడమర వైపు జైపూర్ మండలం,
తూర్పు, దక్షిణ దిశలలో గోదావరి నది సహజ సరిహద్దులుగా ఉన్నాయి.
చరిత్ర:
సాధారణంగా ఊరి పేర్లలో రెండు భాగాలు, అర్ధాలు ఉన్నట్లే చెరినూరు (చెన్నూర్ )కు వాడుకలో రెండు పేర్లున్నాయి.. పండితుల ఉచ్చారణలో చెన్ను అంటే అందమైన ఊరు.. జానపదులు, పామరులు, శాసనలు చేరి "నూరు " (ఊరు) అని తెలంగాణా గ్రామీణ భాషలో విడమరిచి చెబుతున్నారు..
చాలా కాలం క్రితం అంటే కాకతీయ గణపతి దేవ చక్రవర్తి చెన్నూర్ ప్రాంతాన్ని పరిపాలించిన దానికంటే పూర్వమే, ఈ ప్రాంతంలో ఉండే ఇద్దరు అన్నదమ్ములు, కష్టపడి వ్యవసాయం చేసుకునే వారు.. కస్టపడి పండించిన ధాన్యం నుంచి కారు (పంట) కు నూరు బస్తాలు (పుట్లు) ధాన్యాన్ని పంచుకునే వారట.. అందువల్ల ఇది వాడుకలోకి వచ్చి " చెరినూరు ఊరు " గా పిలవబడింది..కాలక్రమేణా చెరినూరు నుండి చెర్ నూరు గా , చెన్నూరు గా జానపదుల నోళ్లల్లో రూపాంతరం చెందినట్లు ఇక్కడి పూర్వీకులు చెబుతున్నారు..
కాకతీయ గణపతి దేవ చక్రవర్తి మంత్రి అల్లు ప్రోలరాజు వేయించిన మంథని శాసనంలో " చెన్నూరి దేశ పాలనకే " అని స్పష్టంగా పేర్కొన్నట్లు చరిత్ర చెబుతోంది.
ఇక బ్రిటీష్ పాలకులకు,నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో జిల్లాకి చెందిన ఎందరో పోరాట యోధులు పాల్గొన్నారు.. చెన్నూర్,ఆదిలాబాద్,ఆసిఫాబాద్ లకి చెందిన పలువురు ఉద్యమకారులు, మహారాష్ట్రలోని చంద్రపూర్, బల్లార్షా లలో శిక్షణ పొంది పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు.. వారిలో మన చెన్నూరు కి చెందిన కిష్టయ్య , సావిత్రిబాయి, అన్నపూర్ణ, జి.కాంతయ్య ,గన్ను నారాయణ,కొమ్మెర నారాయణ, వైద్య వినాయక రావు,వానమామలై వరదాచార్యులు, విశ్వనాథ సూరి,సిరిమొట్ల రామన్న,నీర్ల మధునయ్య ,నాగోత్ రాధాబాయి ,యమునాబాయి, శ్రీరాంభట్ల రమణ ,విశ్వనాధ్, మంచిర్యాలకి చెందిన కిషన్ రావు, లక్ష్మణ్ రావు, గుండే రావు ,శంకర్ రావు, రాజా రెడ్డి,చెరందాస్ రెడ్డి, వెంకట్ రావు తదితరులు ఉన్నారు..

No comments:
Post a Comment