నిజాం కాలం నాటి గడీలు నాటి తెలంగాణ పల్లెల దుస్థితిని, పీడనను గుర్తు చేస్తుంటయి. ‘ఇందారం గడి’. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారంలో... మంచిర్యాల వైపు నుంచి అటు గోదావరిఖనికి వెళ్లే దారిలో ఈ గడి కనిపిస్తది. 1924లో హైదరాబాదును పరిపాలిస్తున్న నిజాం రాజుకు సామంత రాజుగా వ్యవహరించిన రాజ ముత్యం రావు దీన్ని నిర్మించిండు. తన దగ్గరున్న 500 మంది అనుచరులను ఈ గడిలో ఉంచి, ఇక్కడి నుంచి మహారాష్ర్టలోని సిర్వంచా, రాజూరా, గడ్చిరోలి వరకు, అట్లే చెన్నూర్ ప్రాంతం నుంచి చుట్టు పక్కల 200కు పైగా గ్రామాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని హుకుం చెలాయించిండంటరు. రైతులను పీడించి పన్నుల పేరిట డబ్బులు, ధాన్యాలు వసూలు చేసేవాడట.
ప్రతిఫలంగా నిజాం ముత్యం రావుకు ఎన్నో వసతులు, అప్పట్లోనే ఒక విదేశీ కారు బహుమానంగా పంపిండట. దాదాపు వంద ఎకరాలకుపైగా పొలం, 65 ఎకరాల వరకూ మామిడి తోటలు, 300 ఎకరాల పేదల భూమిని ఆక్రమించి పున్నంకుంట అనే చెరువును నిర్మించి, దాని ద్వారా వచ్చే నీటితో వ్యవసాయం చేయించేవాడట. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కావడంతో ముత్యం రావు పరారయ్యిండు.

No comments:
Post a Comment