Saturday, 10 March 2012

మన జిల్లాలో సింగరేణి చరిత్ర



గోదావరి నదీ తీరంలో 350 కిలోమీటర్ల పొడవునా బొగ్గు నిక్షేపాలని వెలికి తీస్తూ 1926 లో మన జిల్లాలోని బెల్లంపల్లి ఏరియా లో బొగ్గు గనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు..1929 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించారు.ఆనాటి బ్రిటీష్ అధికారులు క్రాస్ లీ,మార్గన్స్ ఆధ్వర్యంలో మొదటి భూగర్భ గనిని ప్రారంభించారు..దాని పేరే సౌత్ క్రాస్ కట్ గని. దీనికి అనుబంధంగా incline-1, 2, 24-డిప్ ఏరియా , 65,85 డిప్ గనులు ,మార్గన్ ఫిట్ గనులని ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేసారు..


1961 లో మందమర్రి ఏరియా ,రామకృష్ణాపూర్ ఏరియా,  1975లో శ్రీరాంపూర్ ఏరియా గనులు ప్రారంభమయ్యాయి. దీనికి అనుబంధంగా 1991 లో చె న్నూర్ ఏరియా ఏర్పడి ఓకే జీఎం పరిధిలో నలుగురు ఏజీఎం పాలనలో గనులు కొనసాగాయి. 


మొదట్లో బెల్లంపల్లి రీజియన్లో 29 భూగర్భ గనులు ఉండేవి.కాలక్రమేణా వీటి సంఖ్య 19కి చేరింది. చెన్నూర్  పరిధిలోని చెన్నూర్ 1, 2 గనులు ఐకే 1 గనిలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మూసివేసారు. శ్రీరాంపూర్‌లో ఎస్ఆర్‌పీ 2, 2ఏ గనులను మూసివేసి ఓపన్‌కాస్టు గనిగా మార్చారు. కార్మికుల సంఖ్య 22 వేలనుంచి 14,909కి కు దించారు. ఉత్పత్తి టార్గెట్‌లను పెం చుతూ కార్మికుల సంఖ్యను మాత్రం తగ్గిస్తూ ఇంటికి పంపిస్తున్నది. ఎస్ఆర్‌పీ 2, 2ఏ గనులను మూసివేసి 2007 జనవరిలో ఓపెన్‌కాస్టు ప్రాజెక్టును ప్రారంభించారు. ఆనాటి నుంచి ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ శ్రీరాంపూర్ ఓసీపీ సింగరేణికే తలమానికంగా నిలిచింది.

ఎస్‌డీఎల్ యంత్రాలతో ఉత్పత్తి సాధన:

సింగరేణిలోని అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్‌లో పదమూడు భూగర్బ గనులలో 22వేల మంది కార్మికులు పనిచేసేవారు. వీటిలో ఐదు గనులను మూసివేసి సుమారు 8వేల మంది కార్మికులను స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ద్వారా సూపర్ అన్యూమేషన్ ద్వారా యాజమాన్యం ఇంటికి పంపించింది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది భూగర్భ గనులలో, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులలో భారీ యాంత్రీకరణను చేపట్టి ఉత్పత్తి లక్ష్యాలను అవలీలగా సాధిస్తున్నారు. భూగర్బ గనులలో యాబై ఎస్‌డీఎల్ యంత్రాలను ప్రవేశపెట్టి రోజుకు సుమారు 7500 టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నారు. ఓపెన్‌కాస్టులో 3కేబీఎం శావెల్స్, 100 టన్నుల డంపర్స్, 35 టన్నుల సామర్థ్యం గల వాల్వోలు, 35టన్నుల బీఈఎంఎల్ డంపర్స్‌ను వినియోగిస్తూ రోజుకు 9 వేల టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నారు.


సింగరేణి తాజాగా విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టింది. విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి సంస్థని మరింత అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో, 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జిల్లాలోని జైపూర్ మండలంలో 2010 ఫిబ్రవరి 14 న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, k.రోశయ్య చేతుల మీదుగా శంకుస్థాపన చేయించింది. ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్తును సంస్థ అవసరాలకి వాడుకొని, మిగిలిన విద్యుత్ ని ఇతర సంస్థలకి విక్రయించనుంది.. దీంతో పాటు 20 మెగా వాట్ల క్యాప్తివ్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers