కేవలం బొగ్గు ఉత్పత్త్హిలోనే కాదు సామాజిక బాధ్యతలో కూడా సింగరేణి ముందుంది. సింగరేణి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూనే, మరొక వైపు కార్మిక కుటుంబాల్లో,స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుంది.సింగరేణి సేవా సమితి పేరిట కార్మికుల పిల్లలకి స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి సహకరిస్తోంది. గృహిణులకి కుట్టు శిక్షణ , ఫ్యాషన్ డిజైనింగ్ లతో పాటు చదువురాని వారికి అక్షరాలు నేర్పుతుంది. సంస్థకి అవసరమైన అద్దె వాహనాలని నడపడానికి కార్మికుల పిల్లలు, పునరావాస గ్రామాల వారికి ప్రాధాన్యం ఇస్తోంది.
No comments:
Post a Comment