Wednesday, 14 March 2012

సుద్దాల - రామాలయం


చెన్నూర్ పరిసర ప్రాంతాలలోని రామాలయాల్లో అత్యంత ప్రసిద్ధమైనది. -సుద్దాల గ్రామంలోని రామాలయం. చెన్నూర్ కి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.. దీన్ని తిలకించడానికి పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. జాతర వాతావరణం నెలకొంటుంది. ఇక్కడి పంచలోహ విగ్రహ మూర్తులైన దేవతాముర్తులని చూడటానికి ప్రజలు ఆసక్తి కనబరిచేవారు. అయితే దురదృష్టవశాత్తు నవంబర్ 21, 2003 న ఈ విగ్రహాలు అపహరణకి గురయ్యాయి..దీంతో సుద్దాల గ్రామస్తులు 2004 లో 16,500 రూపాయలు వెచ్చించి నాలుగు విగ్రహాలని కొనుగోలు చేసి మళ్ళీ ఆలయం లో ప్రతిష్టించారు..అయితే ఇటీవలి కాలంలో మార్చి13, 2012  న ఈ విగ్రహాలు కుడా చోరీకి గురయ్యాయి.
శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో, నెలకొన్న జాతర వాతావరణం .

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers