Sunday, 11 March 2012

ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి

ఎటువంటి విద్యార్హతలు లేకున్నా నేరుగా పదో తరగతి సమానమైన కోర్సు చదివే అవకాశాన్ని 2008 విద్యా సంవత్సరం నుంచి ఆంద్ర ప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (APOSS) కల్పిస్తోంది. వివిధ కారణాల వల్ల పాఠశాలకి వెళ్లి చదువుకునే వీలు లేని విద్యార్థులు ఈ ఓపెన్ స్కూల్ విధానం ద్వారా నేరుగా పదో తరగతి పూర్తి చేసుకునే వీలుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపిక చేసిన ఒక ప్రభుత్వ  పాఠశాలలో స్టడీ సెంటర్(అక్రిడిటెడ్ ఇన్ స్టిట్యూట్ )  ని ఏర్పాటు చేశారు.


 అర్హతలు :                      
   ఈ కోర్సు చేయడానికి అభ్యర్థికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. అభ్యాసకుడు తాను పదో తరగతి చదవగలిగే పరిజ్ఞానం కలిగి ఉన్నాననే సొంత ధృవీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వాలి. గతంలో ఏదేని పాఠశాలలో చదివి ఉంటే వాటికి సంబంధించిన పత్రాలని(టీసీ) జతపరచాలి.ఎటువంటి విద్యాభ్యాసం చేయని విద్యార్థులు సంబంధిత ప్రాంత తాహసీల్దార్ నుండి జనన ధృవీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది.
                        ఈ కోర్సు చేయడానికి ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు. 14 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రవేశ విధానం: 
            ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) రూపొందిన దరఖాస్తు ఫారాన్ని 50 రూపాయలు చెల్లించి సంబంధిత స్టడీ సెంటర్ లో పొందవచ్చు. దాన్ని నింపి, పైన పేర్కొన్న పత్రాలను జత చేసి అదే స్టడీ సెంటర్ లో ఇవ్వాలి.
ఇంటర్ చదవాలనుకుంటే :
పదో తరగతి సర్టిఫికేట్ కావాలని అనుకుంటే సెకండరీ కోర్సులోని 5 సబ్జెక్టులు సరిపోతుంది. ఇంటర్మీడియట్ చదవాలని అనుకుంటే ఆరో సబ్జెక్టు చదవడం తప్పనిసరి.దీనికి సంబంధించి చాలా సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి.అభ్యాసకుని ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.


పరీక్ష విధానం :
            సంవత్సరంలో రెండు మార్లు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు.రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 5 సంవత్సరాలలో తొమ్మిది సార్లు పరీక్ష రాసే అవకాశం ఉంది.
అడ్మిషన్ ఫీజు వివరాలు :
                     సెకండరీ కోర్సు - 5 సబ్జెక్టులకు :
                జనరల్ కేటగిరీ  పురుషులు -1000 రూ.
                                         స్త్రీలు - 600 రూ.
               SC,ST,BC, మైనారిటీ లకి -   600 రూ.
                  
                       ప్రతీ అదనపు సబ్జెక్టు కి :
                 జనరల్ కేటగిరీ  పురుషులు -150 రూ.
                                         స్త్రీలు - 150 రూ.
               SC,ST,BC, మైనారిటీ లకి -  150 రూ.


ఫీజు చెల్లించే విధానం :
APOSS వెబ్ సైట్ నుండి చలానా పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకొని ఫీజు మొత్తాన్ని ఏదేని జాతీయ బ్యాంకు (SBI ..etc) లో చెల్లించాలి.


పూర్తి సమాచారం కోసం క్రింది వెబ్ సైట్ ని సందర్శించండి :
www.apopenschool.org/



No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers