Saturday, 17 March 2012

స్త్రీ సంక్షేమ శాఖ కార్యాలయాలు -వాటి విధులు


రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం హైదరాబాద్  లో ఉంది.సీనియర్ IAS అధికారి బాధ్యతలు నిర్వహిస్తే ,కమీషనర్ అని, జూనియర్ IAS అధికారి అయితే డైరెక్టర్ అని వ్యవహరిస్తారు.
విధులు: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అమలవుతున్న.మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలు, పథకాల రూపకల్పన ,నిధుల కేటాయింపు, విడుదల ఇక్కడి నుంచే జరుగుతుంది.గృహ హింస చట్టం అమలుని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ICDS ల ఆధ్వర్యంలో జరుగుతున్నపథకాల అమలుతీరుపై సమీక్షిస్తారు.లోటుపాట్లని సవరించి పకడ్బందీగా అమలు చేస్తారు. జిల్లా ICDS కార్యాలయాలలో జరిగే అవకతవకలపై ఫిర్యాదులు అందుకొని విచారణ జరుపుతారు.శిశువుల దత్తత వంటి కార్యక్రమాలు కూడా చేపడుతారు.వీటన్నింటి అమలుకి జాయింట్ డైరెక్టర్ ,డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు. ఒక్కొక్కరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. JD,DD,RDD,PD ల నియామకం,బదిలీలు,పదోన్నతులు ,విచారణలు,అన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి.


చిరునామా:
కమీషనర్/డైరెక్టర్ 
స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ,
వెంగల్ రావు నగర్ ,
సారధి స్టూడియో ఎదురుగా ,
హైదరాబాద్.
ph: 040-23733221.




మహిళా కార్పోరేషన్:
గతంలో మహిళల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి రుణాలు అందించడం ,శిక్షణలు ఏర్పాటు చేయడం తదితర కార్యాకలాపాల కోసం ప్రతి జిల్లాకొక కార్పోరేషన్ ఉండేది. అయితే 20 సంవత్సరాల క్రితం వీటిని రద్దు చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ లో AP Womens Co-operative Finance Corporation పేరిట సంస్థ ఒక్కటే పని చేస్తోంది.దీని ఆధ్వర్యంలో జిల్లాల్లో మహిళా ప్రాంగణాల్లో శిక్షణ ఇస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని మలక్ చించోలి వద్ద ప్రాంగణం ఉంది.మహిళలు,యువతులకు ఇందులో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.


చిరునామా:
AP Womens Co-operative Finance Corporation ,

Near Sarathi studio,
Vengal Rao Nagar, Hyderabad.
ph: 040-23736842


ప్రాంతీయ శిశు సంక్షేమ శాఖ (RDD)కార్యాలయం :


మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఇది. నాలుగైదు జిల్లాలకి ఒకటి ఉంటుంది.ఆదిలాబాద్ జిల్లా వరంగల్ పరిధిలోకి వస్తుంది. కరీంనగర్, ఖమ్మం,వరంగల్ జిల్లాలు కూడా దీని పరిధిలోకే వస్తాయి. ఈ జిల్లాలలోని ICDS కార్యకలాపాల పర్యవేక్షణ, ఆడిటింగ్, ఆరోపణలపై విచారణ తదితరాలన్నీ ఈ కార్యాలయమే చూస్తుంది.


చిరునామా:
రీజినల్ డిప్యూటి డైరెక్టర్,
ప్రాంతీయ శిశు సంక్షేమ శాఖ (RDD)కార్యాలయం,

లాయర్స్ కాలనీ, వరంగల్.
సెల్: 94408 14455


జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం :

జిల్లాలో కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. గృహ హింస చట్టం అమలు, ఫిర్యాదుల స్వీకరణ,న్యాయ సహాయం అందించడం ,బాలిక శిశు సంరక్షణ పథకం అమలు ,వివిధ అంశాల్లో బాలికలు,యువతులకి శిక్షణ, అనాథ యువతులకు హాస్టల్ ,పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడం వంటి కార్యక్రమాలు చేపడుతారు. పిల్లలకి పౌష్టిక ఆహారం పథకం అమలు, కిషోర బాలికలకు బియ్యం పంపిణీ,ఉద్యోగుల బదిలీ, పదోన్నతులు  మొదలైన వ్యవహారాలు చూస్తారు.
అంగన్ వాడీ కేంద్రాలు,ICDS ల పనితీరుపై ,పర్యవేక్షణ,విచారణ,ఇక్కడి నుంచే జరుగుతాయి.ప్రాజెక్టు అధికారి ద్వారా ఈ కార్యకలాపాల అమలు జరుగుతుంది.


చిరునామా:
ప్రాజెక్టు ఆఫీసర్,

జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ,
విద్యా నగర్, ఆదిలాబాద్.
Ph:08732-232630


ICDS ప్రాజెక్టు కార్యాలయం:


CPDO ల నేతృత్వంలో ICDS ప్రాజెక్టు కార్యాలయాలు పని చేస్తాయి. CPDO లు అంగన్ వాడీ కేంద్రాల పర్యవేక్షణ తో పాటు గృహ హింస చట్టం  ఫిర్యాదులు స్వీకరిస్తారు.అనాథ బాలికలు,శిశువులు లభిస్తే వారిని సంబంధిత కేంద్రాలకి తరలిస్తారు.



ఆదిలాబాద్ జిల్లాలో ICDS ప్రాజెక్టు కార్యాలయాలు  :


చెన్నూర్ : 9491051699
మందమర్రి : 9491051704
బెల్లంపల్లి: 9491051703
లక్షెట్టిపేట : 9491051700
సిర్పూర్ కాగజ్ నగర్ : 9491051706
ఖానాపూర్ : 9491051701
బోథ్ : 9491051702
ఆదిలాబాద్ అర్బన్ : 9491051705
ఆదిలాబాద్ రూరల్ : 9440814459
ఆసిఫాబాద్: 9491051698 
ఉట్నూరు : 9491051695
వాంకిడి : 9491051696
ముథోల్ : 9491051697
నిర్మల్ : 9440814457
సిర్పూర్ (T) : 9440814458 



CDPOల ఆధీనంలో సూపర్ వైజర్లు విధులు నిర్వహిస్తారు.జిల్లాలో 15 మంది గ్రేడ్-1 ,53 మంది గ్రేడ్ -2 సూపర్ వైజర్లు పని చేస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల పర్యవేక్షణ,సర్వే, ప్రీ-ప్రైమరీ బాలికల గుర్తింపు,వాటిలో చేర్పించడం ,గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం,పని చేసేలా చూడటం , GCPకి దరఖాస్తు చేసేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారిని గుర్తించడం, పిల్లలు,తల్లుల ఆరోగ్య పరిరక్షణ,
న్యూట్రీషన్, ఫీడింగ్ ,పౌష్టికాహార సరఫరా , ఇమ్యూనైజేషన్, తదితర అంశాలపై అవగాహన కల్పించడం , ఆ కార్యక్రమాలు అమలయ్యేలా చూస్తారు..


అంగన్ వాడీ కార్యకర్తలు :


వీరు అంగన్ వాడీ కేంద్రాల్లో పని చేస్తారు.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లో ఉంటారు.పౌష్టిక ఆహారాన్నిఅందజేస్తారు.పూర్వ ప్రాథమిక విద్యని అందజేస్తారు.. ఏ ఏ రోజున ఏ పిల్లవానికి ఏ టీకా , వ్యాక్సినేషన్ ఇవ్వాలి. రికార్డు చేసుకొని వాటి ఆధారంగా నర్సులకి సమాచారం అందించి ఆరోజు ఇచ్చేలా చూస్తారు. కిషోర బాలికలకు బియ్యం పంపిణీ, పిల్లలపై త్రై మాసిక సర్వే నిర్వహించడం , మహిళలు, బాలికలకి రక్త హీనత,ఇతర వ్యాధులు ,ఎదుగుదల తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 3412 మంది అంగన్ వాడీ వర్కర్లు, వారికి సహాయకులుగా 3412 ఆయాలు (హెల్పర్స్) పని చేస్తున్నారు. 

మరిన్ని వివరాల కోసం క్రింది వెబ్ సైట్ ని సందర్శించండి.

http://wcdsc.ap.nic.in/ 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers