వేమనపల్లి ప్రాణహిత తీర పరివాహక ప్రాంతం ఇక్కడ గతంలో వెలసిల్లిన మహోజ్వల సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తోంది. తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని రాజారం గ్రామ శివారులోని విగ్రాహాలకి ఘనమైన చరిత్ర ఉంది. పుష్కర తీరానికి వచ్చే భక్తులు ఈ విగ్రహాలని దర్శించుకోవచ్చు. దట్టమైన అడవులు, ప్రాణహిత సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో 12 ,13 శతాబ్దాలకి చెందిన యాదవ మహారాజు కుమారుడైన అమ్మాన రాజు దశావతార విగ్రహాలని నెలకొల్పినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. శంకర దేవుడనే సామంత రాజు విగ్రహాల వద్ద జాతర నిర్వహించే వారు.. మూడేళ్లకి ఒకసారి జరిగే జాతరకి అప్పట్లో పొరుగున ఉన్న మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో గిరిజనులు వచ్చి మొక్కులు తీర్చుకునే వారు. జాతర చివరి రోజు రథాన్ని గ్రామంలో ఊరేగించి పండుగని జరుపుకునే వారు. వేమనపల్లి గ్రామంలోని శివాలయంలో ఉన్న గణపతి విగ్రహం కూడా దశావతార విగ్రహాల కాలానిదేనని పెద్దలు చెబుతుంటారు.. చెన్నూరు లోని శివలింగాలని ప్రతిష్టించిన అగస్త్య మహర్షి రాజారం ప్రాంతంలోని దశావతార విగ్రహాలని సందర్శించి పూజలు చేసి అక్కడి నుంచి శైవ మహా క్షేత్రమైన కాళేశ్వరానికి వెళ్ళినట్లు స్థల పురాణం చెబుతోంది. శ్రీకృష్ణ దేవరాయలు కూడా దశావతార విగ్రహాలని సందర్శించినట్లు కథనాలున్నాయి.
ఈ విగ్రహాలలో నరసింహుని విగ్రహం 12 అడుగుల ఎత్తు, కాళీయ మర్దనుని విగ్రహం 10 అడుగుల ఎత్తు, నటరాజ విగ్రహం 9 అడుగుల ఎత్తు, కూర్మావతార విగ్రహం 8 అడుగుల పొడుగు, బలరాముని విగ్రహం 8 అడుగుల ఎత్తు, లక్ష్మి విగ్రహం 8 అడుగుల ఎత్తు, ఎల్లమ్మ విగ్రహం 6 అడుగుల ఎత్తు, గణపతి విగ్రహం 5 అడుగులు, శివలింగం 4 అడుగులు, నందీశ్వరుని విగ్రహం 3 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కాలక్రమేణా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడంతో కూర్మావతార విగ్రహం రెండు ముక్కలై ధ్వంసమైంది. ఈ విగ్రహాలు ఆదరణకి నోచుకోక పోవడంతో, శిథిలావస్థకి చేరుకొని ద్వంసమవుతున్నాయి. ఇప్పటికీ ప్రతి సంవత్సరం గిరిజనులు విగ్రహాల వద్ద 7 రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు.. పొరుగున ఉన్న మహారాష్ట్ర తో పాటు నెన్నెల , భీమిని , ధహెగాం మండలంలోని ప్రజలు జాతరకి తరలి వస్తుంటారు... ఎంతో చరిత్ర ఉన్న ఈ విగ్రహాలు పూర్వ వైభవం సంతరించుకునేందుకు దేవాదాయ శాఖ వారు కృషి చేయాల్సిన అవసరముంది.

No comments:
Post a Comment