తెలంగాణ మణిహారంగా ఉన్న ‘సింగరేణి’లో అపార నల్ల బంగారం నిక్షిప్తమై ఉన్నది. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న బొగ్గు నిల్వలు ఇంకా 150 ఏళ్లదాకా బయటకు తీసినా తరిగి పోవని ‘జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.
తెలంగాణాలోని కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ‘సింగరేణి కాలరీస్’లో ఇప్పటివరకు కేవలం 929.12 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికి తీయగా, ఇంకా మరో 22,016 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు ‘జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ తేల్చి చెప్పింది. భారీ బొగ్గు నిల్వలు నిక్షిప్తమై ఉన్నప్పటికీ వీటిలో 600 మీటర్ల లోతు వరకు చూసినా 9,435.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అధికారులు నిర్ధారించారు.
140 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో ఇప్పటివరకు కేవలం 929.12 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికితీసారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి భారీగా పెరిగినప్పటికీ, 600 మీటర్ల లోతులోని బొగ్గును వెలికి తీయడానికే ఇంకో 150 ఏళ్లు పడుతుందని, అప్పటివరకు ‘సింగరేణి’కి ఎలాంటి ఢోకా లేదని తేలింది.
భవిష్యత్తులో మరిన్ని అధునాతన పద్ధతులు వచ్చి 1200 మీటర్ల లోతున బొగ్గును వెలికితీసే పద్ధతులు వచ్చినా ఇబ్బందేం లేదని, సింగరేణి మరో 300 ఏళ్లు మనగలుగుతుందని అధికారులు అంచనా వేశారు.
సింగరేణికి ఉజ్వల భవిషత్తు ఉందని ‘జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ చెపుతుండగా, ఇందుకు భిన్నంగా ఆంధ్రా అధికారులు లక్షా 16 వేల మంది కార్మికుల సంఖ్యను 67 వేలకు తగ్గించి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. సింగరేణిలో ఉన్న బొగ్గు నిల్వలు బయటకు తీసే క్రమంలో 2 లక్షల ఉద్యోగాలు సృష్టించుకునే అవకాశాలున్నయి. అంతేగాక, ప్రస్తుతం వెలికి తీయాల్సిన బొగ్గు ఎక్కువ శాతం భూగర్భ గనుల ద్వారానే సాధ్యం.
‘జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ఇచ్చిన నివేదిక ప్రకారం సింగరేణిలోని బొగ్గు నిల్వలు ఇలా ఉన్నయి : ఆదిలాబాద్ జిల్లా : 0-300 మీటర్ల లోతు వరకు 2012.45 మిలియన్ టన్నులు. 300-600 మీటర్ల లోతు వరకు 1427.04 మిలియన్ టన్నులు... మొత్తం 3439.49 మిలియన్ టన్నుల నిక్షేపాలున్నయి.
కరీంనగర్ జిల్లా : 0-300 మీటర్ల లోతు వరకు 1114.80 మిలియన్ టన్నులు, 300-600 మీటర్ల లోతు వరకు 926.39 మిలియన్ టన్నులు... మొత్తం 2041.19 మిలియన్ టన్నులు...
వరంగల్‌జిల్లా : 0-300 మీటర్ల లోతు వరకు 820.69 మిలియన్ టన్నులు, 300-600 మీటర్ల లోతు వరకు 348.84 మిలియన్ టన్నులు, 600 మీటర్లకు పైగా లోతులో 4.39 మిలియన్ టన్నులు కాగా మొత్తం 1167.53 మిలియన్ టన్నుల నిక్షేపాలున్నయి.
ఖమ్మం జిల్లా : 0-300 మీటర్ల లోతు వరకు 2112.74 మిలియన్ టన్నులు, 300-600 మీటర్ల లోతు వరకు 670.44 మిలియన్ టన్నులు, మొత్తం 2783.18 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షిప్తమై ఉంది.
సింగరేణి మొత్తంగా 0-300 మీటర్ల లోతులో 6060.68 మిలియన్ టన్నులు, 300-600 మీటర్ల లోతులో 3370.71 మిలియన్ టన్నులు బొగ్గు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
సింగరేణిలో లభ్యం కానున్న బొగ్గులోని గ్రేడ్‌ల వివరాలు, మిలియన్ టన్నులలో ఇలా ఉన్నయి :
ఆదిలాబాద్ జిల్లా : ‘ఎ’ గ్రేడ్ బొగ్గు 0.12, ‘బి’ గ్రేడ్ బొగ్గు 47.34, ‘సి’ గ్రేడ్ బొగ్గు 533.02, ‘డి’ గ్రేడ్ బొగ్గు 1179.16, ‘ఇ’ గ్రేడ్ బొగ్గు 760.58, ‘ఎఫ్’ గ్రేడ్ బొగ్గు 842.06, ‘జి’ గ్రేడ్ బొగ్గు 77.21 మిలియన్ టన్నులుంది.
కరీంనగర్ జిల్లా : ‘ఎ’ గ్రేడ్ బొగ్గు 0.15 మిలియన్ టన్నులు,
‘బి’గ్రేడ్ బొగ్గు 113.13, ‘సి’ గ్రేడ్ బొగ్గు 550.95, ‘డి’ గ్రేడ్ బొగ్గు 696.72, ‘ఇ’ గ్రేడ్ బొగ్గు 592.61, ‘ఎఫ్’ గ్రేడ్ బొగ్గు 86.87,
‘జి’ గ్రేడ్ బొగ్గు 0.76 మిలియన్ టన్నులున్నట్లు నిర్ధారించారు.
వరంగల్ జిల్లా : ‘ఎ’ గ్రేడ్ బొగ్గు 51.25, ‘బి’గ్రేడ్ 135.97, ‘సి’ గ్రేడ్ బొగ్గు 214.91, ‘డి’ గ్రేడ్ బొగ్గు 146.47, ‘ఇ’ గ్రేడ్ బొగ్గు 262.05, ఎఫ్ గ్రేడ్ బొగ్గు 329.59, ‘జి’ గ్రేడ్ బొగ్గు 27.29 మిలియన్ టన్నులు.
ఖమ్మం జిల్లా : ‘ఎ’ గ్రేడ్ బొగ్గు 23.07, ‘బి’ గ్రేడ్ బొగ్గు 110.92,
‘సి’ గ్రేడ్ బొగ్గు 619.10, ‘డి’ గ్రేడ్ బొగ్గు 297.66, ‘ఇ’ గ్రేడ్ బొగ్గు 427.65, ‘ఎఫ్’ గ్రేడ్ బొగ్గు 859.89, ‘జి’ గ్రేడ్ బొగ్గు 444.88 మిలియన్ టన్నులు ఉన్నట్లు నిర్ధారించారు.
అధికారుల ఈ నిర్ధారణ ప్రకారం తెలంగాణలో మరో 15 దశాబ్దాల పాటు తరగని నల్ల బంగారం ఇక్కడి భూమాత ఒడిలో ఉన్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరిన్ని బొగ్గు ఆధారిత పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. కావలసినన్ని ఉద్యోగాలు కల్పించుకోవచ్చు. అన్నిటికన్నా మిన్న బంగారు ‘తెలంగాణ’కు బాటలు వేసుకునేందుకు మన తరగని గని, ఈ ‘సింగరేణి’ ఒక్కటి చాలు.
కఠోరలో ఉన్న పెరుగునే తీసుకోండి. ఒక పక్కనుంచి చెంచాతో జాగ్రత్తగా తీసి వేసుకుంటేనే దానికి అందం, చందం... కమ్మదనం. అంతేగానీ, ఎక్కడ పడితే అక్కడ వేలు పెడితే, ఆ గడ్డ పెరుగు కాస్త ఇచ్చుక పోతది. ‘సింగరేణి’ ఇప్పుడు అట్లనే అయింది....
ఒకప్పటి నిజాం హయాంలో కూడా బాగానే ఉండె! ఒక ప్రణాళిక ప్రకారం తవ్వకాలు జరిగినయి. కానీ, సీమాంధ్ర పభుత్వం యధేచ్చగా తవ్వుకుంట పోతున్నది. వ్యాపారమే పరమావధిగా తెలంగాణ తల్లి కొంగు బంగారాన్ని అప్పనంగా లాక్కుంటున్నది. దాంతో మన ‘నల్ల బంగారం’ విచ్ఛిన్నమైపోతోంది. దీన్ని కాపాడుకుని, సద్వినియోగ పరచుకుంటే తెలంగాణకు ‘సింగరేణి’ పెద్ద దిక్కు అవుతది.
‘బంగారు తెలంగాణ’కు బాటలు వేసినట్లూ అవుతది. ఇటీవల జియాలజికల్ సర్వే అధికారులు చెప్పినట్టు, ఇంకా నూటాయాభై ఏళ్లపాటు తవ్వినా తరగని గని మన సొంతం. అందుకే ‘సింగరేణి’ మన భూమి పుత్రులకు చెబుతున్నది ఒక్కటే - అది ‘తెలంగాణ సాధన’ అని! అప్పుడే ఇక్కడి మనిషికి, ఈ పరిశ్రమకు శాశ్వత పరిష్కారమని!!

No comments:
Post a Comment