ముస్లీంలు తమ పండగలైన బక్రీద్,రంజాన్ పండగలని పెద్ద ఎత్తున జరుపుకుంటారు..దాదాపుగా ప్రతి మండలంలోని లెక్కించే స్థాయిలోనే మసీదులున్నాయి. చెన్నూర్ పట్టణంలోనే దాదాపు 5 మసీదులున్నాయి. పండగల సమయం లో చెన్నూర్ పట్టణం కొత్త బస్టాండ్ ప్రాంతం లోని దర్గా వద్ద, మందమర్రి పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు..కొన్ని సార్లు ఉచిత అన్న,వస్త్ర దాన కార్య క్రమాలు కూడా చేస్తారు. అలాగే నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ముస్లీంలు స్వేచ్చగా తమ ఆనవాయితీ ప్రకారం పండగ చేసుకుంటారు.. ఈ సందర్భంగా చేసే వంటకాలని ఇరుగు పొరుగున ఉండే హిందువులకి కూడా రుచి చూపిస్తారు.

No comments:
Post a Comment