హిందువులు ఎక్కువగా సనాతన సంప్రదాయ ఆచార వ్యవహారాలని పాటిస్తారు.. భక్తి భావం ఎక్కువే. ఎక్కువగా ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతలని ఆరాధిస్తారు. అలాగే మొక్కులు చేల్లిన్చుకోవడంలో భాగంగా, మేకలు,గొర్రెలు,కోళ్ళని బలి ఇస్తారు.. ఇక్కడి ప్రాంతాన్ని కాకతీయ సామంతులు పాలించడం వల్ల, ఆ కాలం లో వీర శైవ మతం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండటం వల్ల నియోజక వర్గ గ్రామాల్లో, పట్టణాలలో ఎక్కువగా శివాలయాలు కనిపిస్తాయి.. శివాలయాల కన్నా ఎక్కువగా మైసమ్మ తల్లి, పోచమ్మ గుడులతో పాటు , హనుమాన్ మందిరాలు లెక్కకి మించి ఉన్నాయి..దీనికి కారణం ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం పై ఆధార పడిన వాళ్ళు కావడం...అలాగే దయ్యాలు, భూతాలున్నాయని విశ్వసించడం.. అలాగే పవిత్ర దినాల్లో, పండగ రోజుల్లో, దగ్గరలోని గోదావరి ,ప్రాణహిత తీరాల్లో స్నానాలు ఆచరించడం , ఆ తర్వాత దైవ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ.
పండగ వేళల్లో దీపారాధన, కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు, పట్నాలు వేయడం , బోనాలు పోయడం,వ్రతాలు వంటి కార్యక్రమాలు చేస్తారు.. అలాగే దసరా ఉత్సవాలలో బతుకమ్మ ఆటల కోలాహాలం ఎక్కువ ఉంటుంది.. ఎక్కువగా సంబరంగా జరుపుకునే పండగలలో బతుకమ్మ ఆటకే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత దీపావళి పండగని ఘనంగా జరుపుకుంటారు.. లక్ష్మీ పూజలు చేస్తారు. అచ్చమైన తెలంగాణా సాంస్కృతిక వైభవానికి తార్కాణాలుగా ఇక్కడి పల్లెలు, పట్టణాల్లో సంప్రదాయాల్ని పాటిస్తారు.

No comments:
Post a Comment