Saturday, 28 January 2012

రేవెల్లి రామయ్య, కవి

చెన్నూర్ .. కవులు, కళాకారులకు పుట్టినిల్లు. చెన్నూర్ పట్టణానికి చెందిన రేవెల్లి బ్రహ్మయ్య-లక్ష్మిదేవిల ప్రథమ పుత్రుడు కవి రేవెల్లి రామయ్య చేతి నుంచి జాలువారిన కవితలు ఆయన కీర్తిని జిల్లావ్యాప్తంగా చాటాయి. పట్టణంలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసి 1957లో ఏకోపాధ్యాయ వృత్తిలో చేరారు. వృత్తిని కొనసాగిస్తూ వానమామలై వరదచార్యులు వద్ద శిష్యరికం చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండే తన ఉన్నత అభ్యాసాన్ని కొనసాగించారు. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేశారు. చెన్నూర్ జూనియర్ కళాశాలలోనే విద్యాభ్యాసం చేసిన ఆయన ఆ కళాశాలకే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. రామయ్య తెలుగు అధ్యాపకులు కావడంతో ఖాళీ సమయాల్లో కవితలు రాసేవారు. గురువు వానమామలై వరదచార్యుల స్ఫూర్తితో 1998లో శ్రీరామచంద్ర శతకం పుస్తకాన్ని రచించారు. సంస్కృత శ్లోకాలను తెలుగులో అనువాదం చేసి పుస్తకాన్ని ముద్రించారు. అదే స్ఫూర్తితో నీతిసుమాంజలి పుస్తకాన్ని రచిం చారు. ఎందరో కవుల చేతుల మీదుగా సన్మానాలు అందుకున్నారు.

ముద్రితములు :
అంబాగస్తేశ్వర ద్విశతి
(పద్మములు)
గేయాలు, పద్యాలు, ఖండకావ్యాలు
ఆయన స్ఫూర్తితోనే..
వరదన్న స్ఫూర్తే నన్ను కవిని చేసింది. మరెన్నో పుస్తకాలు రాయాలని ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించడం లేదు. నేను రాసిన మరో రెండు పద్యాల పుస్తకాలు త్వరలోనే ముద్రితమవుతాయి. సాహిత్య సేవలో నా వంతు పాత్ర పోషిస్తుండడం మనసుకు ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని ఇస్తోంది అని అంటారు రామయ్య గారు. 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers