Saturday, 21 January 2012

వ్యవసాయ సమాచారం :

చెన్నూర్ నియోజక వర్గంలో వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు అధికం. మొత్తం సాగు విస్తీర్ణం విషయానికొస్తే, చెన్నూర్ మండలంలో 35 వేల హెక్టార్లలో , కోటపల్లిలో21 వేల ఎకరాలలో, జైపూర్ లో 18,490 హెక్టార్లలో , మందమర్రిలో 3600 ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వారి,పత్తి , మొక్కజొన్న, సోయాబీన్,మిరప,కూరగాయలు, సాగవుతున్నాయి. 40 శాతం భూముల్లో పత్తి,పప్పుదినుసులు, మిరప పంటలు, 20 శాతం భూముల్లో వరి పంట పండిస్తున్నారు. రబీ పంటలకి సంబంధించి నియోజక వర్గంలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోగా, ఈ పంటలు దళారుల చేతుల్లోకి వెళ్ళడం తో, కనీస మద్దతు ధర లభించడం లేదు. రబీ వరి పంటకి మద్దతు ధర దొరకడం లేదు. ఈ పంటలని వ్యవసాయ మార్కెట్ ల ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers