అయితే ప్రస్తుతం ఎటీఎంలు కేవలం డబ్బు విత్ డ్రా చేసుకునే మెషిన్ మాత్రమే కాకుండా వివిధ రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏటీఎం ఒక మినీ బ్యాంకు మాదిరిగా పనిచేస్తోంది. బ్యాంకులు పరిమితి సమయంలో పనిచేస్తాయి. అదే ఏటీఎం అయితే 24 గంటలు 365 రోజుల పాటు ఎప్పుడు పడితే అప్పుడు నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
రెగ్యులర్ సర్వీసులు
ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయమే కాకుండా... మీ కార్డు దుర్వినియోగం అవుతుందన్న అనుమానం తలెత్తితే మీ డెబిట్ కార్డు పిన్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబరు) మార్చుకునే సదుపాయం కూడా ఉంది. బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు నిల్వ ఉందనే విషయంతో పాటు మినీ స్టేట్‌మెంట్ ద్వారా మీరు బ్యాంకు ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు (అవి 10 ట్రాన్సాక్షన్) వరకు మాత్రమే పరిమితం అవి బ్యాంకులను బట్టి మాత్రమే. మనకు ఖాతా ఉన్న బ్యాంక ఏటీఎం నుంచే కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంల ద్వారా కూడా మినీస్టేట్‌మెంట్ ద్వారా ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకోవచ్చు.
తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఏదైనీ బ్యాంకుల్లో ఐదు ట్రాన్సాక్షన్ కంటే ఎక్కువ అనుమతించరు. దాటితే బ్యాంకును బట్టి ట్రాన్సాక్షన్‌కు రుసుము వసూలు చేస్తారు.సాధారణ ట్రాన్సాక్షన్‌లే కాకుండా కొన్ని ప్రత్యేక ట్రాన్సాక్షన్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిలో (మనకు ఖాతా ఉన్న బ్యాంకు) ఎటీఎంలలో ఖతా స్టేట్‌మెంట్, కొత్త చెక్‌బుక్ కావాలంటూ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ముఖ్యంగా రాయల్ బ్యాంకు ఆఫ్ స్కాట్‌లాండ్ ఒక అడుగు ముందుకు వేసి చెక్ స్టేటస్‌తో పాటు.. స్టాప్ పేమెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎటీఎంలలోనే డ్రాప్‌బాక్సు సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. చెక్‌ల క్లియర్ అయ్యే సమయం కూడా అక్కడే పేర్కొంటారు.
పేమెంట్ సర్వీసులు
సాధారణంగా జరిగే సేవలు కాకుండా ఇంటర్నెట్ సర్వీస్‌లాంటి సర్వీసులు కూడా ఎటీఎంలు అందుబాటులోకి తెచ్చాయి. ఎటీఎంల ద్వారా బిల్లు చెల్లించే సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎటీఎంల ద్వారా సెల్‌ఫోన్ చార్జీల నుంచి ఇన్స్యురెన్స్ ప్రీమియంల చెల్లింపుల వరకు ఎటీఎంల ద్వారా చెల్లించుకోవచ్చు. ఎటీఎంల ద్వారా ఇన్సురెన్సుబిల్లులతో పాటు టెలిఫోన్ బిల్లు లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు లాంటివి చెల్లించవచ్చు. బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని బ్యాంకులు వేరే బ్యాంకు లకు చెందిన క్రెడిట్‌కార్డుల ద్వారా చెల్లింపులను ఆమోదిస్తున్నాయి. అయితే టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ బిల్లులు చెల్లింపుకు బ్యాంకుకు వెళ్లి రిజిష్టరు చేయిం చుకోవాలి. బ్యాంకు దరఖాస్తు మీరు చెల్లించాల్సిన బిల్లుల గురించి దరఖా స్తులు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క నిబంధన పాటిస్తోంది. ఉదా: ఎస్‌బీఐలో ఎస్‌బీఐ లైఫ్‌ను అనుమతిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కోటక్‌మహీంద్రా, ఓల్డ్‌మ్యూచువల్ లైఫ్ ఇన్సురెన్సు, మాక్స్ న్యూయార్కు లైఫ్, రిలయన్స్ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్‌లను అనుమతిస్తోంది.
ఫండ్గ ట్రాన్స్‌ఫర్స్
ఎటీఎంల ద్వారా వేరు ఖాతాలకు నిధులను బదిల చేసే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సౌకర్యం వల్ల అందరికీ పెద్ద ప్రయో జనం చేకూరుదు. దరఖాస్తులో నిబంధనలు సాధారణ ఖాతాదారుకు పెద్దగా మేలు చేకూరదు. కొన్ని బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు అవే బ్యాంకు లతో పాటు కొన్ని వేర్వేరు బ్యాంకులకు నగదు బదిలీ చేసుకునే సదుపాయం కల్పించింది. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు మాత్రం తమ బ్యాంక పరిధిలోని ఖాతా లకు మాత్రమే బదిలీకి ఆమోదిస్తున్నాయి.
అదే బ్యాంకు ఖాతాలోకి నగ దు బదిలీకి ప్రాసెస్ చాలా సులభం ఖాతా నెంబరు... నగదు మొత్తంలో ఎంట ర్‌చేస్తే తక్షణమే ఖాతాకు బదిలీ అవుతుంది. కొన్ని బ్యాంకులు మరిన్ని వినూత్న స్కీంలను ప్రవేశపెట్టాయి. ఎస్‌బీఐ ఖాతాదారులు గుళ్లు, గోపురాలు, లేదా ప్రభుత్వ రీలీఫ్‌ఫండ్‌లకు నగదు బదిలీ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టాయి. తాజాగా మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తోంది. యాక్సిస్‌బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు 390, 590 ,990 రోజుల కాలపరిమితికి అనుమతిస్తున్నాయి.
No comments:
Post a Comment