Saturday, 21 January 2012

పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్

మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ అవసరాలకి వివాహ రిజిస్టేషన్ పత్రాలు తప్పనిసరి అవుతున్నాయి. స్వదేశంలో పెద్దగా వీటి అవసరం లేకున్నా,విదేశాల్లో ఉద్యోగ ,ఉపాధి ,చదువుల నిమిత్తం వెళ్ళే దంపతులకి పెళ్లి రిజిస్ట్రేషన్ అవసరమవుతోంది., మత, కులాంతర వివాహాలు, ఆలయాలు, ఇతర చోట్ల చేసుకున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వాటిని నమోదు చేసుకుంటే, చట్ట బద్ధత ఉంటుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి వివిధ ప్రభుత్వ పథకాల్లో లబ్ది తో పాటు రుణ సదుపాయం పొందే వీలుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రత్యేక వివాహాలని మాత్రమే జరుపుతారు. హిందూ వివాహాలని ఇక్కడ చేయరు.


హిందూ వివాహం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి :


హిందూ వివాహ రిజిస్ట్రేషన్ కేవలం హిందువుల మధ్య జరిగే పెళ్ళిళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం వివాహం అయ్యేనాటికి వరుడికి 21, వధువుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏ ప్రాంతానికి చెందుతారో ఆ ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 
       వివాహం జరిగిన 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత 5 సంవత్సరాల లోపు వివాహ రిజిస్ట్రేషన్ లకి , సబ్ రిజిస్ట్రార్ ప్రత్యేక అనుమతి, అయిదేళ్ళు దాటితే రాష్ట్రస్థాయి రిజిస్ట్రార్ ప్రత్యేక అనుమతి పొందాలి.
    రిజిస్ట్రేషన్ సమయంలో వధువు, వరుడితో సహా ముగ్గురు సాక్షుల సంతకాలు అవసరం. వధువు, వరుడుల వయస్సు ధృవీకరణ పత్రాలు కావాలి. చదువుకున్న వారైతే విద్యాపరమైన సర్టిఫికెట్లు , చదువుకోని వారైతే ప్రభుత్వ వైద్య అధికారి చేత వయస్సు ధృవీకరణ పత్రం పొందాలి. పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోలు, నివాస ధృవీకరణ పత్రాలు ధరఖాస్తుతో జత చేయాలి.
హిందూ వివాహ రిజిస్ట్రేషన్ కి రూ.5 ఫీజు కింద చెల్లించాలి. గడువు ముగిసిన తర్వాత ప్రతీ సంవత్సరానికి రూ.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.


ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే :


                    వివాహం అయ్యేనాటికి వరుడికి 21, వధువుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వధువు,వరుడు నివసించే గ్రామం, పట్టణాల పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వివాహం చేసుకోవడానికి అమ్మాయి,అబ్బాయి తో పాటు ముగ్గురు సాక్షులు అవసరం. నోటీసు దాఖలు నాటి నుండి 30 రోజుల్లోపు చట్టపరమైన అభ్యంతరాలు రాని పక్షంలో వివాహం చేసుకోవచ్చు. 
30  రోజుల తదుపరి 90 రోజులలోపు సదరు వివాహం జరుపుతారు.
   వరుడు, వధువుల పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు , వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ప్రత్యేక వివాహం నోటీసుకి
రూ.2 , వివాహ నిర్వహణకి రూ.10 రుసుం కింద చెల్లించాలి. 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers